'Help, help, I'm locked inside the chiller' nri rescues employee

Customer rescues employee trapped inside subway freezer in auckland

Amandeep Singh, Newmarket Subway, employee trapped in the chiller, banging sound and screams, hysterical young women, subway, trap, NRI woman, Subway restaurant, freezer, auckland, new-zealand, one-news, food-and-drink, viral video, trending video

A panicked employee trapped inside a New Zealand Subway restaurant freezer for almost two hours has been rescued by a customer. this video goes viral.

ITEMVIDEOS: దేశం కాని దేశంలో ఆ మహిళ సాహసం..

Posted: 07/14/2016 05:44 PM IST
Customer rescues employee trapped inside subway freezer in auckland

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగర శివారు ప్రాంతమైన న్యూమార్కెట్‌లో ఉన్న ఒక షోరూంలో చిక్కుకుపోయిన ఒక ఉద్యోగినిని స్థానిక ఎన్నారై మహిళ కాపాడింది. స్థానిక సబ్‌వే శాండ్‌విచ్ షోరూమ్‌లో పనిచేసే ఆ ఉద్యోగిని లాక్ చేసి ఉన్న వెనుక గదిలో రెండు గంటల సేపు చిక్కుకుపోయింది. బయటకు ఎలా రావాలో తెలియక భయంతో కేకలు పెట్టింది. ఆమె ఆర్తనాదం విన్న ఓ కస్టమర్.. తన భార్యను అలెర్ట్ చేయడంతో ఆమె చాకచక్యంగా డోర్ ఓపెన్ చేసి ఆ ఉద్యోగినికి విముక్తి కలిగించింది. షోరూం ఉద్యోగినిని కాపాడే ఘట్టాన్ని ఆ మహిళ భర్త రికార్డు చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాలలోకి వెళితే.. అమన్‌దీప్ సింగ్ అనే కస్టమర్ ఏదో వస్తువు కొనేందుకు రాత్రి 9.45 గంటలకు న్యూమార్కెట్‌లోని సబ్‌వే ఎంట్రీ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో దుకాణం వెనుకనున్న డోర్ లోపల నుంచి కేకలు వినిపించాయి. తాను ఫ్రీజర్‌లో చిక్కుకుపోయానని, తనను కాపాడమని ఓ మహిళ ఆర్తనాదం వినపడింది. దీంతో సింగ్ అక్కడే ఉన్న తన భార్య రెజీకి ఆ విషయం చెప్పారు. రెజీ అక్కడున్న కౌంటర్‌ మీదుగా లోపలికి దూకి... చాకచక్యంగా నిమిషాల వ్యవధిలోనే మూసుకుపోయిన డోర్‌ను తెరిచారు.

రెండు గంటలకు పైగా దుకాణంలో చిక్కుకుపోయిన ఆ యువతి ఒక్కసారిగా బయటకు వచ్చింది. భయంతో వణికిపోయిన ఆమెను సింగ్ భార్య అక్కున చేర్చుకుని ఓదార్చింది. సబ్‌వే షోరూంలో అక్రమంగా ప్రవేశించడం, లేదా దొంగతనం కేసు తనమీద రాకుండా సింగ్ ఆ మొత్తం వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించాడు. కాగా, షోరూం ఉద్యోగిని బాత్‌రూంలో చిక్కుకుపోయిందని, ఫ్రీజర్‌లో కాదని సబ్‌వే ప్రతినిధి ఒకరు చెప్పారు. బాత్‌రూంలో ఆమె చిక్కుపోయినప్పుడు ఆమె వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, దాంతో ఆమె భయంతో కేకలు వేసినట్టు కనిపిస్తోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subway  trap  NRI woman  Subway restaurant  freezer  auckland  NEW ZEALAND  

Other Articles