25-year-old struggling model commits suicide in Mumbai

Struggling model commits suicide in mumbai

Model, Struggling model, Model commits suicide, Karamjeet Kaur, Suicide, Mumbai police, andheri police, delhi, police, bollywood, crime, shila dixit, suzuki scooter, india bulls, income tax, cancer, health

Police at Andheri, Mumbai had another case to uncover and unravel after they discovered the body of a 25-year-old woman hanging by the ceiling in a flat.

అర్థాంతరంగా తనవు చాలించిన వర్ధమాన మోడల్

Posted: 07/14/2016 06:43 PM IST
Struggling model commits suicide in mumbai

గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవాలని ఎన్నో ఊహాలోకాల్లో తేలియడే కలలు కంటున్న అందమైన అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త. రంగురంగుల హరివిల్లు లాంటి ప్రపంచం బాహ్యసౌందర్యం బ్రహ్మండంగానే వుంటుంది కానీ.. అందులో పేరు ప్రఖ్యాతులు రావాలంటేనే కఠోర దీక్ష, నిరంతర శ్రమ, మొక్కవోని మనోధైర్యం, రాణించగలనన్న అత్మవిశ్వాసం కావాలి. వీటన్నింటికీ పైన సమయం అనుకూలించే వరకు, అవకాశం లభించేవరకు తమ ఖర్చులకోసం తల్లిదండ్రులపై అధారపడినా.. వారు మద్దుతు లభించాలి. లేదంటే.. తమను వెన్నంటే నీడ మాదిరిగా వచ్చే కష్టాలను ఎదురించి ఈ రంగంలో మనగలగడం అసాధ్యం.

అదృష్టం అవకాశాన్నిచ్చి రమ్మని పిలిచిన.. దురదృష్టం కష్టం రూపంలో అడ్డుకుంటే.. వారి వ్యధ వర్ణాణాతీతం. రంగుల ప్రపంచంలో తాను తన పేరున ఒక పేజీని రాసుకుందామని ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన వర్ధమాన మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల కరమ్ జీత్ కౌర్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. రంజాన్ పండుగ ముందురోజే ముంబై వచ్చిన ఆమె తన స్నేహితుడితో కలిసి ఆంధేరీ ప్రాంతంలో ఒక ఫ్లాట్లో ఉంటోంది.

అమె స్నేహితుడు ఇంటికి తిరిగొచ్చేసరికి లోపలి నుంచి తలుపు తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లేసరికి ఆమె నిర్జీవంగా సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని తాడుకు వేలాడుతోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అమె అర్థిక పరిస్థుతులే అమెను ఆ దిశగా పురిగొల్పాయని అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె స్నేహితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Model commits suicide  Karamjeet Kaur  Suicide  Mumbai police  andheri police  

Other Articles