సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం ఫిక్స్ | Sheila Dikshit announced as the UP CM Candidate

Sheila dikshit announced as the up cm candidate

Delhi ex CM Sheila Dikshit, EX CM in UP CM race, Sheila Dikshit UP CM candidate, UP Elections congress CM candidate

Sheila Dikshit announced as the CM Candidate by the Congress Party for the UP Elections.

సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం ఫిక్స్

Posted: 07/14/2016 04:49 PM IST
Sheila dikshit announced as the up cm candidate

దేశ రాజధాని ఢిల్లీకి మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ వైపే హస్తం మొగ్గు చూపింది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించనున్నారు. మొద‌ట్లో బరిలో నిలిచేందుకు షీలా నిరాక‌రించినా.. సీనియ‌ర్ నేత‌ల ఒత్తిడి మేర‌కు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఏఐసీసీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని దృవీకరిస్తూ మీడియాకు తెలిపారు.

'నేను ఉత్తరప్రదేశ్‌ కోడలిని. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదు' అని దీక్షిత్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. యూపీ సవాల్ చాలా పెద్దది. కానీ, విజయం పై ధీమాతో ముందుకెళ్తున్నాం... ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం సంతోషంగా ఉంది అంటూ ఆమె ప్రకటించింది. అయితే అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ మాజీ ఎంపీ సంజరు సింగ్‌ ఎన్నికల ప్రచార కమిటీలో కీలకపాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇదిలా ఉండగానే ఏసీబీ ఆమెకు సమన్లు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో వాటర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వాటర్ బోర్డులో అవినీతి చోటు చేసుకుంది. దీనిపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణకు ఆదేశించింది. కోట్లాది రూపాయల వాటర్ ట్యాంక్ కుంభకోణంలో షీలాకు నోటీసులు జారీ చేశామని, ఆమెను ఆగస్టు 26న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరామని ఏసీబీ చీఫ్ ఎమ్ కే మీనా తెలిపారు.దీనిపై స్పందించిన షీలా ఏసీబీ నుంచి తనకు నోటీసులు అందాయని ధృవీకరించారు.

ఇక ఆమె సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో అప్పుడే జోకులు పేలటం మొదలైంది. ప్రముఖ నటుడిని దర్శకుడిగా చేసి, రాజకీయ వేత్తగా నటిగా చేసి కాంగ్రెస్ యూపీ రాజకీయాలను నడిపించబోతుందని కొందరు, ఏసీబీని పావుగా వాడి ఆమెను ఆడుకోబోతున్నారని, యూపీ ఓటమికి షీలాను బాధ్యురాలిని చేయబోతున్నారని మరికొందరు చమక్కులు పేలుస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi former CM  Sheila Dikshit  UP elections  CM candidate  Congress  

Other Articles