‘DJ waale Babu’ or ‘Nagin Tune’: Songs spark clashes at Kanpur wedding

Songs spark clashes at kanpur in wedding function

Songs spark clashes at Kanpur wedding, police case on six, wedding function, marriage clash, clash over playing of songs, clash over playing of popular Hindi songs, Clashes at wedding function, Rajendra Kumar’s daughter, drunkards, disc jockey, DJ Waale Babu mera Gaana Baja de, marriage procession, ‘Nagin Tune’, six drunkard detained, six drunkard released after warning

Six people were whisked off to a police station from a wedding function after they clashed over playing of popular Hindi songs at the venue in Kanpur,

పెళ్లింట పాటలు తెచ్చిన తంటా.. ఎటెట్టా..!

Posted: 07/14/2016 11:58 AM IST
Songs spark clashes at kanpur in wedding function

పెళ్లి వేడుక అంటే సహజంగా ఆటలు, పాటలు, గానా బజానాలతో సందడిగా ఉంటుంది. డీజే మ్యూజిక్ హోరుతో ఇళ్లంతా కోలాహలంగా మారుతుంది. ఇక బారత్ లలో పెళ్లికోడుకు స్నేహితులు, బంధువుల తరపు వారి డాన్సులు.. కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలతో ఔరా అనిపిస్తుంటాయి. అయితే ఈ భారత్ లలో తీన్మార్ బీట్ కోసం డాన్స్ చేసేవాళ్లు ఎగబడటం సహజమే. కానీ ఇలాంటి వేడుకల్లో ఓ ఇబ్బందికర పరిణామమూ వుందండోయ్ అదేంటంటే పెళ్లితో ఎలాంటి సంబంధం లేని వారు కూడా ఈ భారత్ లలోకి చోచ్చుకువచ్చి.. తమకు నచ్చిన బీట్ లు వాయించమని, వాటికి డాన్స్ చేస్తూ నానా రచ్చ చేస్తారు.

కాన్పూర్ లోని ఓ పెళ్లి వేడుకలో సరిగ్గా అలాగే జరిగింది. పెళ్లింటికి వద్ద డాన్స్ చేస్తున్న కార్యక్రమంలోకి తాగుబోతులు చోచ్చుకువచ్చి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో జోగుతున్న మందుబాబులు అక్కడ నిర్వహిస్తున్న డీజేలో తమకు ఇష్టమైన పాటలు పెట్టమని కోరారు. దీంతో ఇరు వర్గాల వారు ఘర్షణపడ్డాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే. పెళ్లింటి వద్ద నిర్వహిస్తున్న డీజే కార్యక్రమంలోకి వచ్చిన మద్యం మత్తులో వున్న ఓ గ్రూప్ వ్యక్తులు తమకు 'డీజే వాలా బాబు మేరా గానా బజాదే' పాట కావాలని పట్టుబట్టారు. అయితే అక్కడే వున్న మరో గ్రూప్ వ్యక్తులు 'నాగిని ట్యూన్' పెట్టాలని అదేశించింది.

దీంతో ఎవరు కోరికను అమలు చేయాలో తెలియక డీజే తికమక పడ్డారు. నాగిని ట్యూన్ పెడితేనే తాము డ్యాన్స్ చేస్తామని బెట్టుచేశారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి వేడుక వద్దకు వచ్చి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. రాజేంద్రకుమార్ అనే వ్యక్తి కూతురు పెళ్లి జరుగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న రెండు గ్రూపులు తమకు నచ్చిన పాటనే డీజే జాకీ పెట్టాలంటూ గొడవకు దిగారు. దీంతో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wedding  Clashes  Kanpur  Disc Jockey  drunkards  crime  

Other Articles