woman complaints to police on gold ornaments missing from bank locker

Gold ornaments missing from bank locker in abids of hyderabad

gold ornaments missing from bank locker, gold ornaments stolen, bank locker stolen, gold ornaments from bank locker stolen, gold Jewellery, gold ornaments, sbh bank locker, abids sbh bank, crime

woman complaints to police on abids sbh bank as she notices her gold ornaments stolen from bank locker

అబ్రకదబ్రా.. లాకర్ లోని నగలు గాయబ్..

Posted: 07/14/2016 12:25 PM IST
Gold ornaments missing from bank locker in abids of hyderabad

అబ్రకదబ్రా.. అబ్రకదబ్రా.. బ్యాంకు లాకర్ లోని నగలు గాయబ్.. అనగానే పాత చిత్రాలలోని బేతాళ మాంత్రికుడు గుర్తుకు రావడమో.. లేక మాయలు చేసే మాయల మారఠీలు గుర్తుకు రావడమో మనకు తెలుసు. అచ్చంగా ఆ చిత్రాలలోని సన్నివేశాలను రక్తికట్టించే విధంగా మాంత్రికుడు చెప్పనట్లుగానే అన్ని గాయబ్ (అదేనండీ మాయం) అవుతుంటాయి. కానీ ఈ రోజుల్లో అందులోనూ భద్రతకు మారుపేరు బ్యాంకు లాకర్లలో పెట్టిన నగలు మాయం కావడమేమిటి..? విచిత్రంగా వుంది కదూ.

ఎలాంటి భేతాళ మాంత్రికుడు లేకుండానే, మాయల మరాఠీలు లేకుండానే బ్యాంకు లాకర్లో పెట్టిన బంగారు అభరణాలు గాయబ్ అయ్యియి. ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళుతారన్న భయంతో చాలామంది బ్యాంకు లాకర్లలో బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలను దాచిపెడుతుంటారు. ఇక వంటిపైన వేసుకుంటే చైన్ స్నాచర్ల ఘటనలు మనం నిత్యం చూస్తూనే వున్నాం. పోలీసులకు కూడా సవాల్ విసురుతూ వీరు చేసే స్నాచింగ్ భయానికి బంగారు అభరణం అనగానే బ్యాంకు లాకర్లోనే పధిలం అనేస్థాయికి వచ్చేశారు ఆడపడచులు.

ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్ లో 15 తులాల బంగారు అభరణాలను పెట్టిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. లాకర్ తెరచి చూసిన అమెకు అందులో అభరణాలు గాయబ్ కావడంపై విస్మయం వ్యక్తం చేసింది. దీంతో బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అస్నా ఫర్ఖుందా తాజ్ అనే మహిళ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లాకర్‌లో కొన్ని రోజుల క్రితం 15 తులాల బంగారు ఆభరణాలను ఉంచింది. మంగళవారం ఆమె లాకర్ తెరిచి చూడగా.. అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అబిడ్స్ పోలసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold Jewellery  gold ornaments  sbh bank locker  abids  crime  

Other Articles