నిధుల విషయంలో నవ్యాంధ్రకు షాక్ | Central government warn AP govt over funds

Central government warn ap govt over funds

AP govt over central funds, Central government warn AP

Central government warn AP govt over funds.

నిధుల విషయంలో నవ్యాంధ్రకు షాక్

Posted: 07/14/2016 11:31 AM IST
Central government warn ap govt over funds

నిధుల లేమితో నానా పాట్లు పడుతున్న ఏపీ నెత్తిన కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ వేసింది. ఇచ్చిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయకపోతే, వాటిని వెనక్కి తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా 90 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు నివేదికను కేంద్రానికి పంపారు. అవకతవకలు అంతా ఉత్తదేనని పూర్తి వివరాలతో దానిని సమర్పించారు. అయితే అదే సమయంలో మరిన్ని నిధుల ఇవ్వాలంటూ విజ్నప్తి చేయటం కోసమెరుపు.

దీంతో మండిపోయిన కేంద్రం అదనపు నిధుల మాట పక్కనబెట్టి ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అంత బద్ధకమెందుకంటూ ఘాటుగా ఓ రిప్లై ఇచ్చింది కేంద్రం. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను త్వరగతిన వినియోగించుకోవాలని, పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకు తగిన నిధులను ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ పనులు ఆశించిన మేర వేగంగా సాగడం లేదన్నది కేంద్రం వాదన.

ఇంకోవైపు జాప్యానికి గల కారణాలను ఏపీ వివరిస్తున్నప్పటికీ వాటిపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేయటం లేదు. తమ అధికారులు వచ్చి పనులను పరిశీలిస్తారని, ఆలోపు కొన్ని లోపాలైనా సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా పనుల్లో వేగం నమోదు కాకపోతే, ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. నిధుల విడుదలలో కేంద్రం మీన మేషాలు లెక్కిస్తుందని ప్రభుత్వం ఆరోపిస్తున్న సమయంలో ఇలా రివర్స్ పంచ్ పడటంతో ఎలా చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు. ఈ మధ్యే ఆరోగ్య శాఖ నిధులపై తెలంగాణ ప్రభుత్వంపై కూడా కేంద్రం ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP govt  central funds  warn  BJP govt  

Other Articles