Raj Babbar appointed new Uttar Pradesh Congress Committee President

Congress appoints raj babbar as the party s up committee president

2017 Uttar Pradesh Assembly elections, BJP, Congress, Ghulam Nabi Azad, GST, Jammu and Kashmir, Priyanka Gandhi, Raj Babbar, Uttar Pradesh, Assembly Elections-2017, Congress, Raj Babbar, UPCC President

An appeal was made from a section of state Congress workers to appoint former Varanasi MP Rajesh Mishra as the new PCC chief.

సీనియర్ సినీనటుడి చేతికి కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు.

Posted: 07/12/2016 07:27 PM IST
Congress appoints raj babbar as the party s up committee president

దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ.. యూపీసిసి అధ్యక్షుడిగా కోనసాగిన నిర్మల్ ఖాత్రి చేత రాజీనామా చేయించి.. సీనియర్ సినీనటుడికి అ పగ్గాలను అందించింది. బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏఐసీసీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘజియాబాద్(యూపీ) స్థానం నుంచి పోటీచేసి వీకే సింగ్ (బీజేపీ- కేంద్ర మంత్రి) చేతిలో ఓడిపోయిన బబ్బర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల కిందట రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా గులాం నబీ ఆజాద్ ను నియమించిన అధిష్టానం ఇప్పుడు యూపీసీసీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ పేరును ప్రకటించింది. ఫిరోజాబాద్ జిల్లా తుందల్ పట్టణంలో జన్మించిన రాజ్ బబ్బర్ 70వ దశకం చివర్లో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. 1989లో వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీలో చేరారు.

అనంతరం ములాయం అధ్యక్షుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీలో చేరారు. రెండు సార్లు ఆగ్రా స్థానం నుంచి, ఒక సారి ఫిరోజాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2006లో ఎస్సీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్ బబ్బర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన రాజ్ బబ్బర్.. కుల సమీకరణాలకు ప్రాధ్యాన్యమున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపిస్తారో, పార్టీలోనే పుట్టి పెరిగిన సీనియర్లు ఎంతో మంది ఉండగా తనకు దక్కిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Assembly Elections-2017  Congress  Raj Babbar  UPCC President  

Other Articles