Youth kills minor girl who made fun of his poems

Youth kills minor girl who made fun of his poems

Kaleeshwari, Thavamani, kaleswari, school student, brutally killed, sivaganaga hospital, manamadurai police, Ganapathiyendal village, Karthick alias Karthikeyan, SIVAGANGA, MADURAI, tamilnadu, crime

A 11-year-old girl was ‘kidnapped’ and brutally murdered by her relative at Manamadurai, after she allegedly made fun of him for presenting his love poems to her.

తమిళనాడులో మరో ఘాతుకం.. చిన్నారిపై..

Posted: 07/13/2016 07:15 AM IST
Youth kills minor girl who made fun of his poems

చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్య ఘటన మరువక ముందే, ఆరో తరగతి విద్యార్థి ఓ కిరాతకుడి చేతిలో హతమైంది. మంగళవారం ఈ ఘటన మానామధురై సమీపంలో కలకలం రేపింది.శివగంగై జిల్లా మానామధురై సమీపంలోని గణపతి తలవాయి గ్రామానికి చెందిన కరుప్పయ్య, జయ దంపతులకు కాళేశ్వరి(11) అనే కుమార్తె ఉంది. కరుప్పయ్య ఇటీవల మరణించడంతో కుమార్తె కాళేశ్వరితో కలిసి జయ నివసిస్తుంది. మేలనట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో కాళేశ్వరి ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన కాళేశ్వరి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన జయ ఇరుగు పొరుగు వారిని విచారించింది.

పాఠశాల పరిసరాల్లో ఆరా తీయగా, కార్తీక్(25) అనే వ్యక్తి కాళేశ్వరిని మోటారు సైకిల్‌పై ఎక్కించుకు వెళ్లినట్టు తెలిసింది. తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న కార్తీక్ కోసం కుటుంబీకుల వద్ద జయ ఆరా తీసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. దీంతో కాళేశ్వరి గొంతు కోసి హత్య చేశానని, ఆమెను పూడ్చి పెట్టి, తాను చచ్చిపోతున్నట్టు సమాధానం ఇచ్చి కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన జయ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మానా మధురై పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేలనట్టూరు గ్రామానికి సమీపంలోని చెరువు గట్టు వద్ద కార్తీక్ గొంతు కోసుకుని కొన ఊపిరితో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

అతడిని చికిత్స నిమిత్తం శివగంగై ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పోలీసులు కాళేశ్వరిని పూడ్చి పెట్టిన ప్రదేశం కోసం గాలించారు. చివరకు మంగళవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఆ స్థలాన్ని గుర్తించారు. ఖననం చేయబడ్డ కాళేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానామధురై ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు స్పృహలోకి వచ్చిన తరువాత విచారించిన పోలీసులు చిన్నారిని హత్య చేసిన కారణం విని విస్మయం వ్యక్తం చేశారు.

తాను రాసిన కవితలను అపహాస్యం చేస్తూ, ఎగతాళిగా నవ్వినందుకు గాను చిన్నారి కాలేశ్వరిని.. కార్తీక్ హత్య చేశాడని అంగీకరించాడు. తన ప్రేయసి కోసం తాను రాసినట్లుగా పేర్కోంటున్న కవితలను చిన్నారి కాళేశ్వరిని వినిపించగా, అవి ఆయన రాసినవి కాదని, అయినా అవి సరిగ్గా లేవని అమె ఎగతాళి చేస్తూ నవ్విసింది. దీంతో అవేశం అపుకోలేక తాను ఏంచేస్తున్నాన్నో అన్న విషయాన్ని మర్చిపోయిన కార్తీక్ చిన్నారిని గోంతుకోసి హతమార్చాడని అంగీకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles