సానియా డీఎన్ఏ టెస్ట్ కు రంగం సిద్ధం | Court nod to Sania's DNA test in Sindhia Murder Case.

Court nod to sania s dna test in sindhia murder case

Sania's DNA test in Sindhia Case, new twist in Sindhia Murder Case, Baby sania in Sindhia's case

Rajendra Nagar Court nod to Sania's DNA test in Sindhia Murder Case.

ITEMVIDEOS:సానియా డీఎన్ఏ టెస్ట్ కు రంగం సిద్ధం

Posted: 07/12/2016 05:51 PM IST
Court nod to sania s dna test in sindhia murder case

చిన్నారి సానియా ఉదంతంలో న్యాయస్థానం ఎట్టకేలకు కదిలింది. ఆ పాపకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది. మ‌రోవైపు చిన్నారి సానియా ఎవ‌రి సంరక్షణలో పెర‌గాల‌నే అంశంపై ఇంకా సంగ్ధిగ్దత కొన‌సాగుతోంది. నిర్ణయం ప్రకటించే వరకు సానియాను సంర‌క్షణ బాధ్యతలు చేపట్టాలని చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీని కోర్టు ఆదేశించింది.

భ‌ర్త రూపేశ్‌ చేతిలో దారుణంగా హ‌త్యకు గుర‌యిన కాంగో దేశ‌స్థురాలు సింథియా కేసులో విచార‌ణ నిమిత్తం వారి కుమార్తె సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరిన విషయం తెలిసిందే. విచారణ చేప్పటిన రాజేంద్రన‌గ‌ర్ ఉప్పర్ ప‌ల్లి న్యాయస్థానం మంగళవారం వారికి అనుమతి ఇచ్చింది. ఈనెల 15న చిన్నారి సానియా నుంచి అధికారులు డీఎన్ఏ శాంపిల్స్ సేక‌రించ‌నున్నారు. రక్త నమునాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపి ఆ నివేదికను నేరుగా కోర్టుకే సమర్పించనున్నారు.

కాలిపోయిన మృత‌దేహం సింథియాదేన‌ని నిర్ధార‌ణ చేయ‌డం కోసమే ఈ డీఎన్ఏ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. కాగా, భార్యను హ‌త్య చేసిన కేసులో నిందితుడు రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో బుధవారం రూపేశ్‌ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. సింథియా కూతురు సానియా తమకే చెందాలని ఆమె నానమ్మ, రూపేశ్ తల్లి కోరుతుండగా, తమకే చెందాలంటూ సింథియా కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sindhia Murder Case  Sania  Roopesh  Rajendra Nagar Court  DNA test  

Other Articles

Today on Telugu Wishesh