Indian televangelist accused of inspiring Bangladesh attack denies condoning violence

No indian agency approached me zakir naik on him leaving for africa

narendra modi, zakir naik, modi zakir naik, zakir naik narendra modi, zakir naik modi, modi islamic preacher, modi preachers of hate, preachers of hate modi, modi nairobi, nairobi modi, modi news, india news

A controversial Indian Islamic televangelist, alleged by Bangladesh to have incited a terrorist involved in the Dhaka cafe attack, has denied condoning jihad.

నాపై కథనాలు చూసి షాక్ తిన్నాను..

Posted: 07/12/2016 08:33 AM IST
No indian agency approached me zakir naik on him leaving for africa

విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ తనపై వస్తున్న అరోపణలు, అభియోగాలపై ఎట్టకేలకు స్పందించారు. మత ప్రచారం ముసుగులో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారన్న అభియోగాలను అయన ఖండించారు. హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తాను సమర్థించబోనని ఆయన చెప్పారు. ఏ ఉగ్రవాద సంస్థకు తాను ఎన్నడూ మద్దతునివ్వలేదని చెప్పారు. తాను చేసిన ప్రకటనలను సందర్భానుసారం తీసుకోకుండా హింస కోసం ఎవరైనా ఉపయోగించుకుంటే దానిని తాను ఖండిస్తానని అన్నారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు సృష్టించిన నరేమేధం,  ఉగ్రవాద పేలుళ్లు, కాల్పుల విషయంలో తనపై విచారణల జరుపుతున్న మీడియా తీరును చూసి షాక్ తిన్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారతీయ దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు సిద్ధమని, ఎలాంటి సమాచారం కావాలన్నా ఇస్తానని తెలిపారు. ఇంతవరకు భారత అధికారులు తనను సంప్రదించలేదని చెప్పారు. వీలు చిక్కితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానమిస్తూ ఓ వీడియో తీసి దానిని మీడియాకు ఇస్తానని తెలిపారు.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ సోమవారం ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలో నిర్వహించాల్సిన ఆయన మీడియా సమావేశం రద్దయింది. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు దృష్టి సారించిన విషయం విధతమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  zakir naik  Indian Islamic televangelist  PM Modi  

Other Articles