Arvind Panagariya may next RBI Governor

Prominent economist arvind panagariya may next rbi governor

Economist Arvind Panagariya, next RBI Governor

Arvind Panagariya may next RBI Governor.

ఆర్థిక స్థితిగతులు తెలియని వ్యక్తి కాబోయే ఆర్బీఐ గవర్నర్?

Posted: 07/12/2016 09:00 AM IST
Prominent economist arvind panagariya may next rbi governor

రఘురామ రాజన్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సెప్టెంబర్ దాకా టైం ఉంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఆయన లేని లోటును భర్తీ చేసే వ్యక్తి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోపే కొత్త ఆర్బీఐ బాస్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియా కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ పనగారియాకు ప్రమోషన్ దక్కినట్లే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పనగారియా ప్రఖ్యాత ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డీ పట్టా పొందారు. కోలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేశాడు. ఏషియన్ డెవలెప్ మెంట్ బ్యాంకు కు చీఫ్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది. అంతేకాదు ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో లాంటి సంస్థలకు సలహదారుడిగా కూడా విధులు నిర్వహించారు. భారత ప్రభుత్వం 2012 లో ఆయన్ని పద్మభూషణ అవార్డుతో సత్కరించింది. ఇక 2015 లో మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కి ఈయనే వైస్ చైర్మన్.

తన పదవీ కాలంలో ఎక్కువ పని చేసింది విదేశాల్లోనే, దీంతో దేశ ఆర్థిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేని ఆయన్ను ఎలా నియమిస్తారంటూ అప్పుడే వాదన మొదలైంది. అయిన తనకు అత్యంత దగ్గరి వ్యక్తి కావటం, పైగా అపార అనుభవం ఉన్న వ్యక్తి కావటంతో పనగారియాకే మోదీ పగ్గాలు కట్టబెట్టేందుకు డిసైడ్ అయిపోయారంట. ఈ కధనాలపై స్పందించేందుకు పీఎంవోతోపాటు పనగారియా కార్యాలయం ఆసక్తి చూపనప్పటికీ, మరో 48 గంటల్లో ఆయన నియామకంపై అధికార పర్యటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Arvind Panagariya  RBI Governor  

Other Articles