parigi police booked case on tv actress sivani

Case booked on another tv actress srivani

Woman, small screen actress, reported to police, sivani, Tv actress, land dispute, parigi police, rangareddy police, sri kanys, anusha, case on tv actress sivani, counter case

police booked a case against another small screen actress sivani, for attacking a victim in a land dispute in parigi mandal of rangareddy district.

టీవీ నటి శివాణిపై కేసు నమోదు..

Posted: 07/12/2016 07:40 AM IST
Case booked on another tv actress srivani

మరో టీవీ నటిపై పోలీసులు కేను పమోదు చేశారు. శివాణితో పాటు అమె సోదరి మరికందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడిచేశారని పరిగికి చెందిన ఓ మహిళ బుల్లి తెర నటి శ్రీవాణిపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో తమపై కూడా దాడికి యత్నించారని శ్రీవాణి పరిగికి చెందిన అనూషపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిజానిజాల దర్యాప్తుకు చర్యలు చేపడుతూనే మరోవైపు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె సోదరి శ్రీకన్య మరికొందరితో కలిసి సోమవారం పరిగికి వచ్చారు. పరిగికి చెందిన అనూష ఇంటికి వెళ్లి ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరే వారికి విక్రయించేందుకు సదరు స్థలం చూపించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి రావడంతో గొడవ జరిగింది. అరుుతే, శ్రీవాణి హైదరాబాద్ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువచ్చి తనపై దాడి చేశారని అనూష పరిగి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అనూష ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై అనూష దాడికి యత్నించిందని శ్రీవాణి సైతం అనూషపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఉంటున్న ఇంటి స్థలానికి శ్రీవాణికి ఎలాంటి సంబంధంలేదని అనూష పేర్కొనగా..తమ తండ్రి పరిగి గ్రామస్తుడని, ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇరువర్గాల వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sivani  Tv actress  land dispute  parigi police  rangareddy police  sri kanys  anusha  

Other Articles