Lionel Messi handed jail term in Spain for tax fraud

Lionel messi given 21 month sentence for tax fraud

lionel messi, lionel messi jail, lionel messi prison, lionel messi crime, lionel messi tax fraud, messi tax fraud, messi tax case, football news, football

Lionel Messi has been given a 21-month prison sentence for tax fraud. Spanish media say the Barcelona player was convicted along with his father. The sentence can be appealed.

ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీకి మైండ్ బ్లాక్ అయ్యింది.

Posted: 07/06/2016 05:34 PM IST
Lionel messi given 21 month sentence for tax fraud

సాకర్ స్టార్, అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ లియోనెల్ మెస్సీ తిరిగి జట్టులో చేరాలని ఓ వైపు అర్జెంటీనా వాసులు అయనకు శిల్పలను ఏర్పాటు చేస్తూ, ర్యాలీలు కోనసాగిస్తూ అర్థిస్తున్న తరుణంలో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెస్సీకి స్పానిష్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రీమియర్ లీగ్స్ లో బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మెస్సీ.. ఆదాయపన్ను ఎగవేశారనే నేరం రుజువు కావడంతో స్పెయిన్ కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు రెండు మిలియన్ యూరోల జరిమానాను కూడా విధిస్తున్నట్లు కోర్టు తీర్పును వెలువరించింది.

మెస్సీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి జార్జ్ మెస్సీకి కూడా 21 నెలల జైలు శిక్షతోపాటు 1.5 మిలియన్ యూరోల జరిమాన విధించింది. తీర్పు వెలువడగానే మెస్సీ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మెస్సీ, అతని తండ్రి కోర్టుకు మొరపెట్టుకున్నారు. దీంతో న్యాయమూర్తి.. వారికి స్వల్ప ఊరట కల్పించారు. తాను వెలువరించిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లొచ్చని ఊరడించారు. ప్రపంచంలో భారీగా ఆదాయాన్ని గడిస్తోన్న ఆటగాళ్లలో మెస్సీ ఒకరన్న విషయం తెలిసిందే.

కాగా, ప్రీమియర్ లీగ్స్ ద్వారా వేలకోట్ల డాలర్లు పోగేసుకుంటోన్న మెస్సీ.. ఆ మేరకు పన్ను చెల్లించడం లేదంటూ స్పెయిన్ ఐటీ శాఖ మూడు కేసులను నమోదు చేసింది. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు చెప్పింది. ఏళ్లుగా అర్జెంటీనా జట్టు సారధిగా, ఫార్వర్డ్ ఆటగాడిగా కొనసాగిన మెస్సీ గత నెలలో జాతీయజట్టు నుంచి తప్పకున్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్స్ లో చిలీ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా జట్టును అభిమానులు మొదట తిట్టుకున్నా.. మెస్సీ రాజీనామా ప్రకటనతో కాస్త చల్లబడ్డారు. గత ఫుల్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice  Court  Lionel Messi  Spain  Tax fraud  

Other Articles