Donald Trump praises Saddam Hussein for killing terrorists 'so good'

Donald trump praises saddam hussein s approach to terrorism

Islamic State, ISIS terrorists, Presidential Election of 2016, USA, Iraq, former Iraqi dictator, Saddam Hussein, Donald Trump, Politics, 2016 Election, Elections, Politics News, World

Donald Trump praised former Iraqi dictator Saddam Hussein, allowing that he was a "really bad guy" but had redeeming qualities when it came to his handling of terrorists.

మరోమారు నియంతను పోగిడిన డోనాల్డ్ ట్రంప్..!

Posted: 07/06/2016 06:30 PM IST
Donald trump praises saddam hussein s approach to terrorism

వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపుతున్న రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోమారు అలాంటి వ్యాఖ్యలనే చేశారు. ఇరాక్ తన సామ్రాజ్యంలా భావించి.. తన నియంత పాలనను సాగించిన ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో మరోసారి సద్దాం హుసేన్ ను పోగిడారు. అయితే గతంలోనూ ఆయన సద్దాం హుసేన్, ఈజిఫ్టు అధ్యక్షుడు గఢాఫీలపై ప్రశంసలు కురిపించారు.

కాగా అమెరికాకు బద్దశత్రువైన సద్దాం పేరును మరోమారు ప్రస్తావించి.. ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. సద్దాం తన పాలనలో ఉగ్రవాదులను ఏరివేశారని, ఇది మంచిపరిణామని అన్నారు. ‘సద్దాం హుసేన్ చెడు వ్యక్తి. నిజామని భావిస్తున్నారా? ఆయన నిజంగా చెడు వ్యక్తే. అయితే ఆయన చేసిన ఓ మంచిపని గురించి మీకు తెలుసా? అంటూ ట్రంప్ తమ పార్టీ శ్రేణులను ప్రశ్నలడుగుతూ సమాధానాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూనే తన ప్రసంగాన్ని కోనసాగించారు.

సద్దాం చేసిన మంచిపనేంటి..? అంటే ఆయన టెర్రరిస్టులను చంపించాడు. ఉగ్రవాదుల వెన్ను భయంతో కంపించేలా అత్యంత దారుణంగా వారిపై కొరడా ఝుళిపించాడు. ముష్కరమూక తాము తీవ్రవాదులం అని చెప్పుకునేందుకు కూడా జంకేంతలా వారి పీచమణిచాడు అని ట్రంప్ అన్నాడు. ఆయన ఉగ్రవాదులతో అలాంటి కఠిన వైఖరిని అవలంభించడం మంచి పనే..? అవునా..? కాదా..? అని ప్రశ్నించాడు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల వైఫల్యంగానే అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించాడు.

ఇరాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదానికి ఇరాక్ హార్వర్డ్ యూనివర్సిటీలాంటిది. ఎవరైనా ఉగ్రవాది కావాలనుకుంటే ఇరాక్ వెళ్లాలి. నిజమే కదా? ఇది చాలా బాధాకరం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ గతంలోనూ సద్దాం, ఇతర నియంతలను ప్రశంసించారు. సద్దాం, గడాపీ వంటి నియంతలు ఇప్పటికీ అధికారంలో ఉంటే వందం శాతంగా మెరుగ్గా ఉండేదని అన్నారు. కాగా ఇరాక్ అధ్యక్షుడిగా సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అమెరికా దళాలు దాడులు చేసి, పదవీచ్యుతుడిని చేశాయి. యుద్ధ కోర్టులో సద్దాంను విచారించి ఆయనకు ఉరిశిక్ష విధించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS terrorists  USA  Iraq  Saddam Hussein  Donald Trump  Politics  

Other Articles