minor girl who turned down love proposal raped

Minor girl raped after rejecting love proposal in hyderabad

rape, girl, marriage, BDL, office boy, chandrayan gutta police station, srinivas rao, dilip, love failure boy rapes girl, girl rapes after rejecting marriage, marriage rejected girl raped,

A contract worker of BDL working as office boy, had raped minor girl as she refused his love proposal and marriage request.

ప్రేమను, పెళ్లిని తిరస్కరించిన మైనర్ బాలికపై అత్యాచారం

Posted: 07/02/2016 07:42 AM IST
Minor girl raped after rejecting love proposal in hyderabad

ప్రేమోన్మాదులు మరో విధంగా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు తమను ప్రేమించలేదని, లేక వివాహం చేసుకోని, తమ ప్రేమను తిరస్కరించిందని తెలిసి వారిపై కక్ష గట్టిన ప్రేమోన్మాదులు వారిపై దాడులకు పాల్పడి అంతమోందించే చర్యలకు పాల్పడగా, తాజాగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా తన పేమను తిరస్కరించడంతతో పాటు వివాహానికి కూడా అంగీకరించడం లేదన్న కక్షతో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

స్థానిక ఎస్సై ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.... బండ్లగూడ న్యూఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన దిలీప్(20) కాంచన్ బాగ్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో ఆఫీస్‌బోయ్‌గా పని చేస్తున్నాడు. ఇంటి ఎదురుగా ఉండే పదో తరగతి వరకు చదివిన 17 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే అలాంటి వాటికి తాను చాలా దూరంగా వుంటానని అమ్మాయి తేల్చిచెప్పింది. ఇక ప్రేమోన్మాది కొత్త పంథాలో పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అయితే దానిని కూడా మైనర్ బాలిక తిరస్కరించింది.

యువకుడు తన వెంటపడి ప్రేమ, పెళ్లి అంటూ వేధిస్తున్నాడని బాలిక తమ ఇంట్లో గతంలోనే చెప్పగా యువకుడిని పద్దతి మార్చుకోమ్మని పెద్దలు నచ్చజెప్పారు. అయినప్పటికీ తీరు మార్చుకోని దిలీప్.. బాలిక తల్లి కూరగాయల కోసం బయటికి వెళ్లిన సమయాన్ని గమనించి.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయాన్ని అదునుగా చేసుకుని, ఇంట్లోకి చోరబడి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక సోదరుడు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  girl  marriage  BDL  office boy  chandrayan gutta police station  srinivas rao  dilip  

Other Articles