jennifer lopez shares adventures video on facebook

Jennifer lopez dares her fans adventureous bike ride shared on facebook

breathtaking journey of Indian guy goes Viral as Hollywood actress jenefır lopez praises challengers her followers can you ride on this road.

breathtaking journey of Indian guy goes Viral as Hollywood actress jenefır lopez praises challengers her followers can you ride on this road.

ITEMVIDEOS: హాలీవుడ్ నటి ప్రశంసతో.. వైరల్ గా భారత యువకుడి వీడియో.!

Posted: 07/02/2016 08:29 AM IST
Jennifer lopez dares her fans adventureous bike ride shared on facebook

ప్రముఖ పాప్ సింగర్, నటి, హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్కు ఓ 27 ఏళ్ల భారత యువకుడి సాహస యాత్ర తెగనచ్చేసింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన చరణ్ ప్రీత్ సింగ్కు ఫోటోగ్రఫీ అన్నా బైక్ పై లాంగ్ ట్రిప్ లకు వెళ్లడమన్నా తెగ సరదా. ఆ సరదాతో తాను తీసి పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఎంతలా అంటే ఏకంగా లైకుల మీద లైకుల, షేర్ల మీద షేర్లతో సంచలనంగా మారింది. అదెలా అంటే.. దానికి కారణం జెన్నీఫర్ లోపెజ్. అత్యంత ప్రమాదకరమైన రోడ్డుపై ప్రయాణించిన వీడియోను అమె లైక్ చేసింది.

జమ్మూ కశ్మీర్లోని ఇష్త్యారీ, త్యారీ మధ్యలో ఉన్న దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డు మార్గాల్లో ఒకటి. ఎత్తైన కొండలు, వాటి మధ్యలో లోతైన లోయలు. కిందకు చూడడానికే అతి భయంకరంగాఉండే లోయల నడుమ చిన్న మట్టిరోడ్లు. ఇలాంటి మార్గాల్లో చరణ్ తన సహచరులతో కలిసి బైక్పై ప్రయాణించాడు. దీనికి సంబంధించి వీడియోను బైక్ వెనకవైపు కూర్చున్న వ్యక్తి షూట్ చేశాడు. రోడ్డు మార్గం మొత్తం చిన్న చిన్న గుంతలు, రాళ్లు దర్శనమిస్తాయి.

మధ్య మధ్యలో కొండలపైనుంచి కిందకు జారిపడే జలపాతాలు కూడా రోడ్డు పై నుంచే వెళ్లడంతో నీటిలోంచే బైక్ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ చిన్న తప్పిదం జరిగినా బైక్ లోయల పడడం మినహా వేరే దారే లేదు. ఒక వేళ అదే గనుకు జరిగితే కనీసం వారి ఆనవాళ్లు కూడా దొరకడం అనుమానమే. ఈ ట్రిప్ను చరణ్ తన సహచరులతో కలిసి విజయవంతంగా పూర్తి చేసి దీనికి సంబంధించి వీడియోను సోషలో మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి ముగ్ధురాలైన జెన్నిఫర్ లైక్ చేసింది.

అంతటితో అగకుండా ఈ వీడియోను షేర్ కూడా చేసింది. దీనికి కాప్షన్ కూడా పెట్టింది. మీరు ఇలాంటి సాహసం చెయగలరా అంటూ...కామెంట్ కూడా రాసింది. 4,55,49,546 మంది ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిలో 59 వ స్థానంలో జెన్నీఫర్ ఫేస్ బుక్ పేజీ ఉంది. ఇంకేముంది షేర్ చేసిన కొద్దిసమయంలోనే వేలల్లో లైక్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారిలో ...ఎలాగైనా ఇలాంటి రోడ్లపై ఒక్కసారైనా రైడ్ చేయాలని యువకులు భావిస్తుంటే, కిక్ కోసం మరీ అంత ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణం అవసరమా అని కొంచెం వయసుపైబడిన వారు కామెంట్లలో తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles