Two dead and 35 injured in Dhaka, hostage situation in progress

Unidentified gunmen take hostages in dhaka

bangladesh, dhaka attack, gunfire at dhaka, dhaka terror attack, holey artisan bakery attack dhaka, terror attack bangladesh, terror news, gunmen attack at holey artisan bakery in bangla desh, latest news, world news

At least two persons has been killed and 35 injured after gunmen stormed a restaurant in the diplomatic quarter of Dhaka,

ITEMVIDEOS: ఢాకా రెస్టారెంట్పై ముష్కరదాడి.. బంధీలుగా 60 మంది

Posted: 07/02/2016 07:02 AM IST
Unidentified gunmen take hostages in dhaka

ఐరోపా దేశాలను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు తమ పంథాను మార్చుకుని అసియా దేశాలపైకి తమ దృష్టిని మరల్చారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాను టార్గెట్ చేసుకుని బేకరిలోకి చోరబడి ఇద్దరిని పొట్టనబెట్టుకుని 60 మందిని తమ బందీలుగా చేసుకున్నారు. సరిగ్గా రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం రోజు ప్రార్థనలు ముగిసిన అనంతరం.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ముష్కరులు ఈ బేకరీలోకి చోరబడి దాడులకు తెగబడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ముష్కరులకు, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.  

డాకలోలోని దౌత్యవేత్తలు అధికారులు, విదేశీయులు అధికంగా వచ్చే ప్రఖ్యాత హోలీ ఆర్టిజాన్‌ బేకరీలోకి తొమ్మిది మంది ఉగ్రవాదులు చోరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో పోలీసు ఉన్నతాధికారి సలావుద్దీన్‌ ఖాన్‌తోపాటు మరొకరు మృతి చెందగా.. ముపై అయిదు మంది గాయపడగా, అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారని సమాచారం.

కాగా, బేకరీలో వున్న 60 మందిని ఉగ్రవాదులు తమ బందీలుగా చేసుకున్నారు. బందీలుగా ఉన్న వారిలో 20 మంది విదేశీయులున్నారు. బందీల్లో భారతీయులు కూడా ఉన్నారని తెలిసింది. నినాదాలు చేస్తూ ఉగ్రవాదులు స్వైర విహారం చేసినట్లు సమాచారం. అయితే బంగ్లా ప్రభుత్వం పరిస్థితి బాగానే ఉందని చెబుతోంది. రంజాన్ చివరి శుక్రవారం నాడు ఈ కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళనతో బంగ్లా ప్రజలు ఉక్కిరి బక్కిరిమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందోళనకు గురవుతున్నారు.
 
బేకరీలోకి దుండగులు ప్రవేశించగానే అక్కడ వంటపని చేసే కొందరు వ్యక్తులు పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నారు. ఉగ్రుల ఏకథాటి కాల్పులను బంగ్లా భద్రతా సిబ్బంది ఎదుర్కొనలేకపోయిందని సమాచారం. ఈ విషయాన్ని మాత్రం బంగ్లా సర్కార్ కొట్టిపారేస్తోంది. భారత్ దౌత్య కార్యాలయం కూడా కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉంది. ఇదిలా ఉగ్రవాదుల డిమాండ్స్ ఏంటో చెప్పాలని భద్రతా బలగాలు కోరాయి. వారితో చర్చించే అవకాశం ఉందని కొన్ని ప్రముఖ చానెల్స్‌‌లో వార్తలు వస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  Dhaka cafe and bakery  Gun battle  diplomatic quarter  60 people hostage  

Other Articles