‘Needless or continuous’ honking may soon earn commuters hefty fines

Hefty fines to be imposed on needless honkers

traffic rules, transport ministry, motor vehicles act, honking, hefty fines for honking, honking fines, road safety rules, road transport and safety bill, noise pollution

The Centre plans to introduce new rules to check noise pollution, including fines ranging from Rs 500 to Rs 1 lakh.

అనవసరంగా వాహనాల హారన్ కోడితే..

Posted: 06/29/2016 11:36 AM IST
Hefty fines to be imposed on needless honkers

దేశంలో శబ్ద కాలుష్యం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ముందుగా శబ్ధకాలుష్యానికి ప్రధాన కారణంగా భావిస్తున్న వాహనాల హారన్ మోతలపై చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతుంది. అవసరం లేకపోయినా హారన్ కొట్టే వాహనదారుపై భారీ ఎత్తున జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటోందంది. అనవసరంగా హారన్ మోతలు మ్రోగించిన వారికి రూ. 500 నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాదు మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు, గ్యారేజి యజమానులపై కూడా భారీ జరిమాన విధించేందుకు ప్రణాళిక వేసుకుంది. ఇలా మోటార్ బైక్ నుంచి కార్ల వరకు మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే వారికి లక్ష రూపాయలు వరకు వడ్డన పడే అవకాశాలు లేకపోలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, మోటారు వాహన చట్టాన్ని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సవరణలు చేస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేసిన ఎంవి చట్టాన్ని అమోదించాలని కేంద్రం తలపెడుతోంది.

హారన్లు కొట్టేవాళ్లకు జరిమానాలు వడ్డించాలన్న ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ వేస్తారట. ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే తప్పులేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం జరిమానాలు తప్పవట. నివాస ప్రాంతాలతో పాటు సైలెంట్ జోన్లుగా పేర్కొనే ప్రాంతాలలో కూడా హారన్లు మోగించకూడదు. ప్రధానంగా స‍్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నచోట హారన్ కొట్టకూడదన్న బోర్డులు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివాళ్లను అదుపుచేయడానికే జరిమానాలు వేయబోతున్నారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : needless horns  hefty fines  sound pollution  

Other Articles