gurgaon gau raksha dal forces beef smugglers to eat cow dung

Beef smugglers forced to eat cow dung

gurgaon, cow vigilantes, forced, eat, Cow Dung, Beef smugglers, rizwan, mukiyar, gau mata ki jai, jai shri ram, faridabad, haryana, kindi-manesar-palwal express way, bajranj dal

a video has emerged showing cow vigilantes forcing two suspected beef smugglers to eat cow dung and chant Gau Mata ki Jai and Jai Shri Ram.

ITEMVIDEOS: నెట్ లో గో రక్షా దళ్ వీడియో హల్ చల్

Posted: 06/29/2016 12:21 PM IST
Beef smugglers forced to eat cow dung

ముక్కోటి దేవతలకు కొలువైన రూపంగా హిందువులు గోవును భావిస్తుంటారు. పరమ పవిత్రంగా పూజించే గోవులతో తమ మనోభావాలకు విరుద్దంగా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఇప్పటికే అనేక సందర్భాలలో చెప్పారు. అయినా పలువురు అక్రమంగా గో మాంసాన్ని రవాణా చేయడం, విక్రయించడం చేస్తూ అడ్డంగా దోరుకిపోతున్నారు. ఇలా గో మాంసాన్ని అక్రమంగా తీసుకు వెళుతున్న ఇద్దరు యువకులను నిర్బంధించిన గో రక్షా దళ్ కార్యకర్తలు వారితో ఆవు పేడను తినిపించారు. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

రిజ్వాన్, ముక్తిహర్ అనే ఇద్దరూ ఓ లారీ నిండా ఆవు మాంసాన్ని తరలిస్తుండగా, ఫరీదాబాద్ - ఢిల్లీ బార్డర్ లో గో రక్షా దళ్ అడ్డగించింది. ఆపై వీరికి దేహశుద్ధి చేసి, పేడను తినిపించి 'గో మాతా జిందాబాద్' జై శ్రీరామ్ అంటూ నినదించే చేశారు. గోవు పేడను తినలేక వాంతులు చేసుకున్నా వారిని గో రక్ష దళ్ సభ్యులు విడిచిపెట్టలేదు. త్వరగా తింటేనే వదులుతామని చెప్పారు. కాగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల నుంచి 3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా  పోలీస్ అధికారి  తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితులను  జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు. ఇదే అసలు చర్చకు దారితీస్తుంది. ఇంటర్ నెట్ సహా సోషల్ నెట్ వర్కులలో వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షిస్తున్నా.. అలాంటి సాక్ష్యాలు ఏమీ లేవని పోలీసులు బాహటంగా చెప్పడాన్ని నెట్ జనులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

అక్రమంగా గో మాంసాన్ని సరఫరా చేయడం తప్పే అయితే వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.. అంతేకానీ వారిపై దాడి చేసి.. అవు పేడను తినిపించేందుకు గో రక్షా దళ్ సభ్యులు ఎవరన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గాయపర్చిన వాళ్లను పోలీసులు రక్షించేందుకు యత్నించడం సబబు కాదని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, ఈ ఘటన తరువాత గో రక్షా దళ్ చీఫ్ ధర్మేంధ్ర యాదవ్ స్పందిస్తూ, తమ కార్యకర్తలు మంచి పని చేశారని, ఆవు పేడ పవిత్రమైనదని, దాన్ని తినడం ద్వారా వారు పాపాలను పోగొట్టుకున్నారని చెప్పారు. తమ వారు చేసిన దానిలో తప్పేమీ లేదని అన్నారు. గోవుల విషయంలో నిర్దయగా ప్రవర్తించే వారికి ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles