‘Drunk’ student drives car on to Worli footpath, creates ruckus after arrest

21 year old drunk woman rams car into divider assaults six cops

mumbai, drunk student, mumbai drunk student, student ruckus with police, worli drunk student, worli accident, worli drunk student, mumbai news

The incident took place near Worli’s Podar Hospital around 2 am, when Chembur resident Bhide and three others, including a 17-year-old minor boy, were on their way home.

యువతి.. తప్పతాగి ఒళ్లుమరచి పోలీసులపైనే..

Posted: 06/17/2016 01:50 PM IST
21 year old drunk woman rams car into divider assaults six cops

మద్యం తాగి కారు నడపవద్దని నిబంధనలు నోక్కివక్కాణిస్తున్నా.. బడా బాబుల పిల్లలు మాత్రం చట్టాన్ని తమ చుట్టాలుగా చేసుకుని రయ్ రయ్ అంటూ ఖరీదైన కార్లలో తిరిగేస్తున్నారు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. రంగంలోకి దిగిన పోలీసులపై వారి ఏ రకంగా వీరంగాన్నిచూపుతారు. అచ్చంగా ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. పీకలదాక తాగిన ఓ 21 ఏళ్ల యువతి తనను అరెస్టు చేసిన పోలీసులపై చిందులు తొక్కింది. నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది.

అందేకాదు ఏకంగా పోలీసులపైనే చేయిచేసుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు పోలీసులపై అలానే ప్రవర్తించింది. దీంతో పోలిస్ స్టేషన్ లో సిబ్బందితో పాటు అధికారులు కూడా అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గౌరీ బిడే అనే మహిళ ఫుల్లుగా మద్యం తాగి కారు వేగంగా నడిపింది. మద్యం మత్తులో అది కాస్త వెళ్లి పోద్దార్ ఆస్పత్రి సమీపంలో డివైడర్కు ఢీకొట్టింది.

ఇదే కారులో మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇష్టమొచ్చినట్లు తిట్టింది. ఓ ఆరుగురు పోలీసులపై చేయి చేసుకుంది. అసభ్యకరంగా తిడుతూ నానా హంగామా చేసింది. అయితే, ఆ యువతి ఎక్కవ మద్యం తాగిందనే విషయం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఆమెతోపాటు ఉన్న ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drink driving  Mumbai  Gauri Bhide  Worli  Mumbai cops  

Other Articles