మంత్రిగారి గాలి ప్రేమగాథ... | Union minister tie the knot with Air hostess

Union minister tie the knot with air hostess

Union minister Babul Supriyo, Babul Supriyo second marriage, Babul Supriyo Rachna Sharma, Air hostess Rachna Sharma, Rachna Sharma babul supriyo, ఎయిర్ హోస్టెస్ తో మంత్రి ప్రేమయాణం, కేంద్ర మంత్రి ఎయిర్ హోస్టెస్ పెళ్లి, కేంద్ర మంత్రి రెండో పెళ్లి, ఎయిర్ హోస్టెస్ తో మంత్రి రెండో పెళ్లి, తాజా వార్తలు, రాజకీయాలు, తెలుగు వార్తలు, latest news, telugu news

The BJP leader, Union minister Babul Supriyo is all set to tie the knot for a second time, and his bride-to-be is Rachna Sharma, a Delhi-based air hostess with Jet Airways.

మంత్రిగారి గాలి ప్రేమగాథ...

Posted: 06/17/2016 01:54 PM IST
Union minister tie the knot with air hostess

ప్రేమకు పంచభూతాలు సాక్షి అన్నది మంత్రిగారి విషయంలో నిజమైంది. 35,000 వేల అడుగుల ఎత్తులో, గాల్లో,  విమానం ప్రయాణంలో ఆయనకు ప్రేమ పుట్టింది. అది కూడా ఎయిర్ హోస్టెస్ పైన. అంతే మాటలు కలిపి క్రమంగా ఆమె మనసు దొచుకున్నాడు. ఇదంతా బాలీవుడ్ సింగర్, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో గురించి... త్వరలో ఆయన మరోసారి మరో ఇంటివాడు కాబోతున్నాడు. అలా ఎందుకన్నామంటే ఆయనకు అల్రెడీ పెళ్లయి ఓ కూతురు కూడా ఉంది కాబట్టి..

మొన్నటి ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేసి ఎంపీగా విజయం సాధించిన బాబుల్ సుప్రియోకి వచ్చిరాగానే నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన కేబినెట్ లో ఏకంగా పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రిగా బాబుల్ కు చాన్స్ ఇచ్చాడు.  పాలనలోనూ సత్తా చాటుతున్న బాబుల్ గతకొద్ది కాలంగా జెట్ ఎయిర వేస్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న రచనా శర్మతో నిండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంట. ఎయిర్ హోస్టెస్ తో ప్రేమ ఎలా అనేగా మీ డౌటు.

సింగర్ గా ఉన్న సమయంలో అప్పటికింకా రాజకీయ రంగప్రవేశంపై తర్జనభర్జన పడుతున్నాడు బాబుల్. ఆ సమయంలోనే ఓసారి విమాన ప్రయాణంలో యోగా గురువు బాబా రాందేవ్ తో తన రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తుండగా, రచనా శర్మ ఆయన్ను పలకరించిందట. సీటు దక్కితే మాత్రం విజయం మీదేనంటూ భుజం తట్టారట. దీంతో ఆమెపై ఆసక్తి చూపిన బాబుల్, శర్మ ఫోన్ నెంబరు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లు చేసుకోవడం... శర్మ చెప్పినట్లే బాబుల్ కు టికెట్ రావడం, ఎంపీగా విజయం సాధించడం, కేంద్ర మంత్రిగా పదవి దక్కడం జరిగిపోయాయి. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది.ఇటీవలే ఆమెతో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఆగస్టు 9న ఈ జంట దంపతులుగా మారనున్నారు. ఆమెకు మాత్రం ఇది మొదటి వివాహమే!

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles