BJP leader arrested for alleged molestation on flight

Bjp leader arrested for molesting minor on flight

Ashok Makawan, BJP leader molests teen, teen molested on flight, IndiGo Airlines

Ashok Makwana, a BJP leader was arrested on Tuesday by the Sardarnagar police for allegedly molesting a 13-year-old girl while traveling onboard IndiGo Airlines on May 28.

బీజేపి నేత అరెస్టు.. చిన్న పిల్లపై లైంగిక వేధింపులు

Posted: 05/31/2016 07:19 PM IST
Bjp leader arrested for molesting minor on flight

సమాజంలో తమను కూడా కొందరు ఫాలో అవుతారని, తాము సన్మార్గంలో నడిస్తేనే.. ఇతరులకు సద్భుద్దులు చెప్పేందుకు వీలుంటుందని తెలసి కూడా తప్పులు చేయడం మన నాయకులకు పరిపాటిగా మారింది. తాము చేసేది తప్పని తెలుసు అందులోనూ చేయరాని చోట, చిన్న పిల్లతో అంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ బీజేపి విమర్శలపాలవుతున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బీజేపీ నేత అరెస్టయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసుల అమె పక్కన సీట్ల ప్రయానించిన బీజేపీ నేత అశోక్ మక్వానాను సర్ధార్ నగర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ లైన్స్ వారి నుంచి కొన్ని డాక్యుమెంట్లను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల కిందట బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో ఓ బాలిక(13) గోవాలోని తన అంకుల్ ఇంటికి వెళ్లింది. మే 28న ఇండిగో విమానంలో ఇంటికి తిరుగు ప్రయాణమైంది.

మక్వానా ఆ బాలిక పక్క సీట్లో కూర్చుని ట్రావెల్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇంటికి చేరుకున్న బాలిక, విమాన ప్రయాణంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని పేరేంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. వ్యాపారవేత్త అయిన బాలిక తండ్రి తమకు ఫిర్యాదు ఇచ్చాడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి బీడీ పాటిల్ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అశోక్ మక్వానాను అరెస్ట్ చేశామని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Makawan  BJP leader molests teen  teen molested on flight  IndiGo Airlines  

Other Articles