అంత మందికి ఎయిడ్స్ ఎలా? | 2234 Get HIV After Blood Transfusion In India

2234 get hiv after blood transfusion in india

HIV, AIDS, blood transfusions, AIDS Control Organization (NACO), ఎయిడ్స్, రక్త మార్పిడి, భారత్, national news, entertainment, latest news

The National AIDS Control Organization (NACO), released data, according to which 2,234 persons across India have been infected with the Human Immunodeficiency Virus (HIV) while getting blood transfusions in the last 17 months alone.

అంత మందికి ఎయిడ్స్ ఎలా?

Posted: 05/31/2016 06:25 PM IST
2234 get hiv after blood transfusion in india

ఎయిడ్స్ ఎలా వస్తుందంటే టక్కున ఒకే కారణాన్ని ఎక్కువ మంది చెబుతుంటారు. కానీ, లైంగిక కలయిక అనేది అది వ్యాపించేందుకు కారణాలలో ఒకటి మాత్రమే. వ్యాధిగ్రస్తులు వాడిన సిరంజీల ద్వారా, రక్త మార్పిడి లాంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. కానీ, నిర్లక్ష్యంతో చేస్తున్న ఓ చిన్న తప్పు ఇప్పుడు ఎయిడ్స్ గణనీయంగా వ్యాపించడానికి కారణమౌతోంది. హెచ్ఐవీ కేసులు ఎలా ఎక్కువగా నమోదవుతున్నాయని సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి కోరగా, దానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) ఇచ్చిన వివరణ షాక్ కి గురిచేస్తోంది.

2014 నుంచి 2016 మధ్య 17 నెలల కాలంలో సుమారు 2234 మందికి ఎయిడ్స్ కేవలం రక్తమార్పిడి ద్వారానే వ్యాపించిందట. ఈ లిస్ట్ లో 361 కేసులతో యూపీ ఫస్ట ప్లేస్ లో ఉండగా, తర్వాతి స్థానంలో 292 కేసులతో గుజరాత్ సెకండ్ ప్లేస్ లో ఉంది. రక్తాన్ని సరిగ్గా పరీక్షించకుండా వేరే వ్యక్తికి ఎక్కించడంతోనే 2వేల మందికి ఈ మహమ్మారి వ్యాపించిందని నాకో తెలిపింది. దీనికి బలం చేకూరుస్తూ బ్లడ్ బ్యాంకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే జీవితాలు నాశనం అవుతున్నాయని తాజాగా ఒక నివేదిక కూడా వెల్లడైంది. అసలు రక్తం ఎక్కించే సమయంలో మలేరియా, హెపటైటిస్ లాంటి  వ్యాధులతోపాటు, హెచ్ఐవీ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయో లేదోనని జాగ్రత్తగా పరిక్షించాలి. కానీ, ఇప్పుడున్న బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రులు ఆ విషయాన్నిలైట్ తీస్కుంటున్నాయంటూ సదరు నివేదిక తెలిపింది. అయితే ఎయిడ్స్ సోకిన 3 నెలల దాకా అది రక్తపరీక్షలో కూడా తేలదంట. ఆ గ్యాపు(విండో పీరియడ్)లో పేషంట్లు రక్తం దానం చేయటం వల్లే ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉండొచ్చని నాకో అంచనా వేస్తోంది.  


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HIV  AIDS  blood transfusions  AIDS Control Organization (NACO)  

Other Articles