Days after transfer for praising Nehru, IAS officer asked to explain ‘anti-Modi’ post on Facebook

Ias gangwar gets a notice for fb post on modi

ias officer, ias officer nehru, ias officer facebook, ias officer transferred, ajay singh gangwar, gangwar ias officer, ias officer, ias officer modi hate speech, ias officer nehru praise

BJP government in Madhya Pradesh asked IAS officer Ajay Singh Gangwar to explain a purported Facebook post calling for a people’s revolution (jan kranti) against PM Narendra Modi.

అమాత్యులకు ఓ రూలు.. అధికారులకు మరోకటా..?

Posted: 05/31/2016 08:24 PM IST
Ias gangwar gets a notice for fb post on modi

కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్నా.. అన్నింటా ద్వంద ప్రమాణాలను అచరిస్తుందన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. అధికార పగ్గాలను చేపట్టగానే కేంద్రమంత్రులందరికీ సోషల్ మీడియాలో దేశ ప్రజలకు అనుసంధానం కావాలని చెప్పారు. అయితే అదే క్రమంలో అధికారులు పేస్ బుక్ లో ప్రజలతో టచ్ లు వుంటే.. వారి వ్యక్తిగత పేస్ బుక్ అకౌంట్లలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తే.. మాత్రం దానిని తప్పబడుతున్నారు. ప్రస్తుతం ఇదే తరహా వ్యవహరంతో ఓ అధికారి బదిలీ కూడా అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో వచ్చిన ఓ వార్త సంపాదకీయాన్ని లైక్ చేసి, షేర్ చేయడమే అ ఆదికారికి శాపంగా పరిణమించింది. అలా చేసినందుకు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారి అజయ్ సింగ్ గంగ్వార్ తాఖీదు అందుకున్నారు. ఫేస్బుక్ లో చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి అజయ్ గంగ్వార్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తాకీదులలో ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఆయనపై చర్య తీసుకున్న ప్రభుత్వం.. బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వరించిన ఆయనపై బదిలీ వేటు వేసింది.

తదుపరి అదేశాలు అందేవరకు ఆయనను అక్కడి నుంచి సెక్రటేరియట్ కు బదిలీ చేసింది. అయితే మోడీకి వ్యతిరేకంగా ప్రజావిప్లవం రావాలని వున్న వ్యాసం తన టైమ్ లైన్ పై లేదని, దానిని కేవలం తాను లైక్ చేసి, షేర్ చేసుకున్నానని ఆయన చెప్పారు. కాగా అంతకుముందు మోదీని విమర్శిస్తూ, జవహర్ లాల్ నెహ్రును పొగుడుతూ ఆయన ఫేస్ బుక్ లో చేసిన కామెంట్స్ తోనే తనను మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం బదిలీ చేసిందని ఆయన అరోపించారు. ఇది పూర్తిగా భావవ్యక్తికరణ, వాఖ్ స్వతంత్ర్యానికి వ్యతిరేకమని, దీనిపై తాను న్యాయపోరాటం కూడా చేస్తానని గాంగ్వర్ అంటున్నారు. ఇక గంగ్వార్ ను వివరణ కోరడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని విమర్శించింది. అజయ్ సింగ్ ను తిరిగి బర్వానీ కలెక్టర్ గా తిరిగి నియమించాలని డిమాండ్ చేసిం

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Gangwar  IAS officer  shivraj singh chouhan  Madhya Pradesh  

Other Articles