Sack Raghuram Rajan: Subramanian Swamy writes to PM Narendra Modi

Swamy to pm sack raghuram rajan

BJP MP subramanian swamy, RBI Governor, Raghuram Rajan, renewal, second term, economists opinion poll, ETMarkets.com poll, PM modi, Arun jaitley, Narendra modi, Indian economy, raghuram rajan chicago, swamy modi, swamy rajan letter, rbi, narendra modi, swamy letter to modi

Subramanian Swamy, in his letter to PM Modi, said: Raghuram Rajan is in this country on a Green Card and "therefore mentally not fully Indian."

నిపుణులు వారిస్తున్నా.. తీరు మార్చుకోని సుబ్రహ్మణ్య స్వామి

Posted: 05/17/2016 02:21 PM IST
Swamy to pm sack raghuram rajan

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పై విమర్శలకు మరింత పెదును పెడుతున్నారు. ఆర్థిక నిపుణులు బీజేపి ఎంపీ సుబ్రమణ్య స్వామి వాదనలను ఖండిస్తున్నా ఆయన మాత్రం తన తీరును మార్చకోకుండా, ఆయన ఏకంగా ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ ను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆయన  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్న రాజన్ వెంటనే  తొలగించాలని స్వామి డిమాండ్ చేశారు.

ఆయన ప్రధానికి రాసిన  లేఖలో రాజన్  మానసికంగా పూర్తి  భారతీయుడు కాదని  స్వామి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వం రాజన్  కు జారీ చేసిన గ్రీన్ కార్డ్  ను పొడిగించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.  రాజన్ తీసుకున్న నిర్ణయాల మూలంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ తన దాడిని కొనసాగించారు.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆర్బీఐ గవర్నర్ పై బహిరంగంగానే  పొగడ్తలు కురిపించారు.  సంక్లిష్ట ఆర్థిక సమస్యలను పెర్ ఫెక్ట్ గా విశ్లేషించారని ఒక సమావేశంలో ప్రశంసించారు. అటు  కేంద్ర బ్యాంకునకు,  ప్రభుత్వానికి మధ్య  గౌరవప్రదమైన సంబంధంగా  నిలిచారనే ఖ్యాతిని రాజన్ దక్కించుకున్నారు.  మరోవైపు స్వామి ఆరోపణలపై రాజన్ మౌనం వహించారు. అటు రెండవసారి ఆయనకు  ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు  అప్పటించడంపై నిర్వహించిన సర్వేలో  రాజన్  పెర్ ఫెక్ట్ అంటూ నెటిజన్లు కితాబిచ్చారు. మరి కేంద్రంలోని మోడీ సర్కార్.. రాజన్ వైపు మొగ్గుచూసుతుందా..? లేక సుబ్రహ్మణ్య స్వామి సిఫార్పులకు ప్రాధాన్యమిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  RBI  Raghuram Rajan  bjp  Subramanian Swamy  pm modi  

Other Articles