keralites doesnt believe that malayam bjp leader words

Sreesanth gave 70 seats to bjp in kerala exit polls give 0 4

Sreesanth, 70 seats to BJP, Kerala, exit polls, cricketer turned politician, kerala assembly polls, keralites bjp, udf, ldf, Kerala exit polls,Assembly elections

cricketer turned politician sreeshanth says bjp will win 70 assembly seats in keral, but keralites doesnt believe him

అబ్బే.. అయన మాటలు గానీ.. బీజేపికి అంత సీన్ లేదు..

Posted: 05/17/2016 04:50 PM IST
Sreesanth gave 70 seats to bjp in kerala exit polls give 0 4

క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన స్పీడస్టర్ శ్రీశాంత్ తాను ప్రాతినిద్యం వహిస్తున్న పార్టీకి  కేరళ అసెంబ్లీలో ఏకంగా 70 అసెంబ్లీ స్థానాలు గెలుపోందుతుందని ప్రకటించాడు. అందరూ యూడీఎఫ్, ఎల్డీఎప్ ల గురించే మాట్లాడుతున్నారని, మరి తన పార్టీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బెట్టింగ్ అరోపణలో క్రికెటర్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ ఇచ్చిన శ్రీశాంత్.. అటు నటనా రంగంలో అసక్తితో పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపికి ఆయనే అశాకిరణంగా కనిపించాడు. అతడ్ని ముందు నిలిపి ఎన్నికలకు వెళ్లినా.. బీజేపి తగు సంఖ్యలో సీట్లు రావన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. అయినా తమ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆయన అంటున్నారు. అంతేకాదు తాను చాలా ఆశావాదినని, కాబట్టి కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు.

కేరళలో ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే సీటుగానీ, ఒక్క ఎంపీ సీటుగానీ గెలువని కమలం పార్టీ ఈసారి శ్రీశాంత్‌పై భారీ ఆశలే పెట్టుకున్నది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఎర్నాకులంలోని పోలింగ్ బూత్‌లో ఓటువేసిన అనంతరం శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ 'నేను చాలా ఆశావాదిని. బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయి' అని ధీమాగా చెప్పాడు. కానీ ఆశావాదంపై నీళ్లు చల్లుతూ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి సున్నా నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. దీంతో రుసరుసలాడుతున్న శ్రీశాంత్‌ అంతా అధికార యూడీఎఫ్‌, ప్రతిపక్ష ఎల్డీఎఫ్‌ గురించే మాట్లాడుతున్నారని, బీజేపీకి ఓటువేసిన వారి సంగతి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన అనుభవ రాహిత్యం వల్ల అలా మాట్లాడుతున్నారని, అంతే కానీ బీజేపికి కేరళలో అంత సీన్ లేదని కొందరు బీజేపి నాయకులే వెనుక పెదవులు కొరుక్కుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreesanth  70 seats to BJP  Kerala assembly polls  exit polls  

Other Articles