ETmarkets.com readers' survey: India wants Rajan 2.0 for the RBI

Rajan wins economists trust on etmarkets com survey as rbi governor

BJP MP subramanian swamy, RBI Governor, Raghuram Rajan, renewal, second term, economists opinion poll, ETMarkets.com poll, PM modi, Arun jaitley, Narendra modi, Indian economy, raghuram rajan chicago

Raghuram rajan has been attacked and criticized for being insensitive to the concerns of borrowers and the state of economy. The government has not yet recommended a renewal of his term.

రాజన్ ది బెస్ట్ అంటూ ఆర్థిక నిపుణుల అభిప్రాయం

Posted: 05/17/2016 01:33 PM IST
Rajan wins economists trust on etmarkets com survey as rbi governor

రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి బాధ్యతలను అప్పగించాల్సిన సమయం అసన్నం కాగానే.. ఏకంగా ఆ పదవిలో కొనసాగుతున్న రఘురామ్ రాజన్ అర్బిఐ గవర్నర్ ఆ పదవికి పనికిరాడని, ఆయన వల్ల దేశ అర్ధిక పరిస్థితి దిగజారుతుందని, ఆయనను చికాగో పంపించివేయాలని కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలను చేపట్టిన బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామి అరోపణలు చేయడాన్ని రమారమి అర్థిక నిపుణులందరూ వ్యతికేకిస్తున్నారు. నూటికి 86 శాతం మంది సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

మరి ఈ నేపథ్యంలో కేంద్రం రఘురామ్ రాజన్ కే రెండో సారి బాధ్యతలు అప్పజెప్పనుందా..? లేద్దా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాగా, అందుకు ఏమా్త్రం అస్కారం లేకుండా మరో పర్యాయం రాజన్ కే ఆ బాధ్యతలను అప్పగించాలని అటు నెట్ జనులతో పాటు, ఇటు అర్థిక నిఫుణులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఫైర్ బ్యాండ్ బీజేపీ నేతలే రాజన్ పదవి పొడిగింపును వ్యతిరేకిస్తున్నా... రాజన్ కు సెకెండ్ ఇన్నింగ్స్ అవకాశం ఇవ్వాలని మెజార్టీ సభ్యులు ఓకే చెబుతున్నారు. దీంతో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ మద్దతు అంతా ఇంతా కాదని, అయనే పాటించిన అర్థిక సూత్రాలే దేశాన్ని పురోగతి వైపు నడిపిస్తుందని నెట్ జనులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

9,168 మందిపై ఈటీమార్కెట్లు.కామ్ జరిపిన సర్వేలో 69శాతం మంది రాజన్ ఫర్ ఫెక్ట్ అని.. ఎలాంటి వంకలు పెట్టాల్సినవసరం లేదంటూ 10వ ర్యాంకును ఇచ్చారు. 87శాతం మంది ఆర్ బీఐ గవర్నర్ గా రెండోసారి రాజన్ నే ఎంపికచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భారత ప్రజల హృదయాల్లో, మైండ్ లో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ కు సముచిత స్థానం ఉన్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడవుతోంది. ఈటీమార్కెట్లు. కామ్ వెల్లడించిన ఈ సర్వే ఫలితాలపై రాజకీయ నాయకులు మౌనం వహిస్తున్నారు.

సర్వేలో వెల్లడైన కీలక అంశాలు...

*    రాజన్ పై బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలను 86శాతం మంది కొట్టిపారేశారు.
*    ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీరేట్లు తగ్గిస్తూ రాజన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని పేర్కొంటూ 78శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.
*    87శాతం మంది రాజన్ కే ఆర్ బీఐ సెకండ్ ఇన్నింగ్స్ అప్పజెప్పాలన్నారు.
*    1 నుంచి 10 మధ్యలో రాజన్ కు రేటింగ్ కేటాయించగా... ఫర్ ఫెక్ట్ అని తెలుపుతూ 10 ర్యాంకింగ్ ను 69శాతం ఇచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  RBI  Raghuram Rajan  ETMarkets.com poll  

Other Articles