Spicejet’s 11th anniversary sale: Flight tickets starting as low as Rs 511

Spicejet announces rs 511 ticket offer

spicejet sale, book spicejet ticket, spicejet cheap tickets, cheap flights, cheap air tickets, spicejet 11th anniversary sale, book spicejet tickets, book air ticket, cheap air ticket india, cheapest airline, cheapest flights

spicejet sale, book spicejet ticket, spicejet cheap tickets, cheap flights, cheap air tickets, spicejet 11th anniversary sale, book spicejet tickets, book air ticket, cheap air ticket india, cheapest airline, cheapest flights

స్సైస్ జెట్ వార్షికోత్సవ బంఫర్ ఆఫర్..

Posted: 05/17/2016 12:36 PM IST
Spicejet announces rs 511 ticket offer

భారత రెండో అతిపెద్ద చౌక ధర విమానయాన సంస్థగా పేరోందిన స్పైస్ జెట్ తమ విమానయాన ప్రయాణికుల కోసం మరో బంపర్ అఫర్ ప్రకటించింది. రిటర్న్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించిన నేపథ్యంలో స్పైస్ జెట్ కూడా మళ్లీ చౌకధర యుద్దాన్ని ప్రకటించింది. తన 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పైస్ జెట్ తమ కస్టమర్లకు మూడు రోజుల సేల్ ఆపర్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది. స్వదేశీ విమానయాన ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులకు కూడా ఆఫర్ ను అందిస్తుంది.

స్వదేశీ విమాన టికెట్లను కేవలం బేస్ ధరల మాత్రమే వసూటు చేసి మరీ గమ్యస్థానాలను పంపుతామని చెప్పగా, విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకుల టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుకింగ్స్ ఇవాళ్టి (మంగళవారం) నుంచి మొదలై గురువారం (మే 19) వరకు ఉంటాయి. మే 19 వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ ప్రకటించింది. అయితే స్పైస్ జెట్ డైర్టెక్ట్ ఫ్లైట్ సర్వీసులు వున్న దేశాలకు మాత్రమే ఈ ఆఫర్ కింద టిక్కెట్లు వర్తిస్తాయని తెలిపింది.

అలా బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగాను, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్‌లో టికెట్లు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల ముందు వచ్చినవాళ్లకు ముందు అనే పద్ధతిలోనే వీటిని కేటాయిస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. మరెందుకు అలస్యం.. మీరు విమానాన్ని ఎక్కి హాయిగా ఒక ట్రిప్ వేయండి.. అల్ ది బెస్ట్.

మనోహర్
=========

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spicejet  special offer  11th anniversary sale  low air fare  

Other Articles