#PoMoneModi: ‘Go home, kid’ Tweeple to PM after Kerala, Somalia analogy

Pm modi trolled on twitter for somalia comment

PM Modi,Narendra Modi,Modi Kerala,Modi Kerala Rally,Kerala Assembly Polls,Kerala assembly polls 2016,Kerala Assembly Elections,Kerala Polls,Kerala Somalia

People tweeted their reactions to Modi’s comment comparing Kerala to Somalia, using the hashtag #PoMoneModi- roughly translates to- ‘go home, kid’.

ప్రధాని మోడీపై కేరళవాసులు ఫైర్.. ఇంటికెళ్లు మోడీ అంటూ కామెంట్లు

Posted: 05/11/2016 05:10 PM IST
Pm modi trolled on twitter for somalia comment

కేరళవాసులతో పాటు దేశ ప్రజలు కూడా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్మిపోస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు అన్న విజ్ఞత వున్న రాష్ట్రవాసులు అంత తేలిగ్గా ఎవరిపై బురద జల్లరు. కానీ ఎందుకో తెలియదు కాని కేరళవాసులు మాత్రం ప్రధానిపై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. 'దేవుడి సొంత ప్రదేశం' అని పేరున్న కేరళ రాష్ట్రాన్ని ఆయన అకాలి రాజ్యం, దోంగల రాజ్యంగా పేరుగడించిన సోమాలియాతో పోల్చడంతో ఇన్నాళ్లు ఆయనను అకాశానికి ఎత్తిన నెట్ జనులే ఆయనపై సామాజిక మాధ్యమాల ద్వారా మండిపడుతున్నారు.

గుజరాత్ లో మాల్ న్యూట్రీషియన్ వుండడానికి కారణం అక్కడి మహిళలు డైటింగ్ చేయడమనే చెప్పిన ప్రధాని నుంచి అంతకన్నా ఎక్కువ ఏం అశిస్తామంటూ మండిపడుతున్నారు. మరికోందరు రాష్ట్రవాసులకు అవహేళన చేసి ఎన్నికలలో పబ్బం గడపాలనుకుంటున్నారా.. ఇక్కడ చెల్లదు.. ఇంటికి పో మోడీ అంటూ కామెంట్ చేశారు. ఇంకోదరు బీహార్ లో ఇదే తరహా వ్యాఖ్యాలు చేయడంతో అక్కడి ప్రజలకు అయనకు తగిన గుణపాఠం నేర్పించారు. ఇక వాళ్ల తరువాత కేరళవాసులు కూడా మోడీకి పాఠాలు నేర్పించాలంటూ మరికోందరు ట్విట్ చేశారు.

కేరళలా తయారవ్వాలని ఈ రాష్ట్రంలా తాముండాలని అన్ని రాష్ట్రాలు అనుకుంటాయని, ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శరాష్ట్రమని పలువరు కామెంట్లు చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధిలో కేరళ సోమాలియా కన్నావెనుకబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు, దళిత యువతిపై అత్యాచారం, హత్య లాంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు.

అయితే.. మోదీ ఇలా వ్యాఖ్యానించడంపై ట్విట్టర్ జనాలు తీవ్రంగా స్పందించారు. 'పో మోన్ మోదీ' అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఓ మళయాళం సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'పో మోనే దినేశా'కు పేరడీ. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని దీనికి అర్థం. ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని ఇలా వ్యాఖ్యానించారని, రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడం సిగ్గుచేటని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. సోమాలియా లాంటి కరువు దేశం లక్షణాలు ఒక రాష్ట్రంలో ఉన్నాయనడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు.

ప్రధాన మంత్రి వెంటనే తన సోమాలియా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళవాసులను చులకనగా చూసే ప్రధాని వైఖరిలో మార్పు రావాలని ఆయన కోరారు. మే 16న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సోలార్ కుంభకోణం, ఒక మహిళ సీఎం మీద, ఆయన కుమారుడి మీద చేసిన ఆరోపణల లాంటివి సంచలనం సృష్టించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles