Supreme Court says Harish Rawat can take charge as Uttarakhand CM

Rawat has won trust vote admits centre in supreme court

Harish Rawat, Uttarakhand trust vote, Floor test in Uttarakhand, Uttarakhand political crisis, Uttarakhand Congress rebels, uttarakhand, uttarakhand floor test, floor test, floor test live, Rawat has won trust vote, congress, bjp, harish rawat, congress floor test, uttarakhand assembly, uttarakhand government

The Supreme Court declared, clearing the decks for the reinstatement of Harish Rawat as the chief minister as he won trust vote of the hill state.

రాష్ట్రపతి పాలన రద్దు చేయండి.. కేంద్రానికి ‘సుప్రీం’ అదేశం

Posted: 05/11/2016 04:22 PM IST
Rawat has won trust vote admits centre in supreme court

దేవుడు, రాష్ట్ర ప్రజలు తమ వైపున ఉన్నారని, తాము తప్పకుండా బలపరీక్షలో గెలుపొందుతామని ధీమాను వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అనుకున్నట్లుగానే విశ్వాసపరీక్షలో నెగ్గి.. ముఖ్యమంత్రిగా తన పదవీ బాధ్యతలను తిరిగి చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్ లో గత రెండు నెలలుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాసపరీక్షలో హరీశ్ రావత్ విజయం సాధించినట్లు ప్రకటించింది. బలపరీక్షలో నెగ్గేందుకు ఆయనకు కావాల్సిన 31 మంది సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఆయన తన ఫక్షంలోకి తీసుకున్నారని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో హరీష్ రావత్ మళ్లీ తన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టాలని అదేశించింది.

న్యాయస్థానం తీర్పును వెలవరించిన తరువాత హరీష్ రావత్ మాట్లాడుతూ.. న్యాయం ఇవాళ రాజ్యాంగ శక్తులకు విద్యాను, రాజకీయ పరిజ్ఞానాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని, యువనేత రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు. తాను రాజీయాంగా అవసానదశలో వున్న సమయంలో వారి పూర్తి సహాయసహకారాలు అందించి అండగా నిలిచారని పేర్కోన్నారు.

అలాగే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలసి.. రాష్ట్రాభివృద్దికి వారి సహకారం కూడా అవసరమని, అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతానని చెప్పారు. ఇదిలా వుండగా, ఉత్తరాఖండ్ లో ప్రజాస్వామ్యం పరఢవిల్లిందని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అణగదోక్కాలని చూసిన కుయుక్తులన్ని విఫలమయ్యాయన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు వున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్ లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ వ్యవహారం నుంచి మోదీ సర్కారు పాఠాలు నేర్చుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసాలకు మళ్లీ పాల్పడరని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసేందుకు ప్రయత్నించబోరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడంతో మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand  supreme court  congress  bjp  harish rawat  

Other Articles