Rocky Yadav remanded in two-day police custody

Road rage killer rocky yadav loved guns his facebook profile suggests

Road rage, killer, Rocky Yadav, loved guns, Facebook, Manorama Devi, Bihar MLC, Rocky Yadav's Mother, social media, Facebook, remand, police custory, manorama faces arrest, manorama suspended

Rakesh Ranjan Yadav , alias Rocky, has probably been the most searched Bihar man on Facebook.

నెట్ జనుల వేలం వెర్రి.. రాకీ కోసం అన్వేషణ

Posted: 05/11/2016 06:48 PM IST
Road rage killer rocky yadav loved guns his facebook profile suggests

నెట్ జనుల వేలం వెర్రి కాకపోతే.. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా.. వారి గురించి తెగ వెతికేసి.. సోషల్ మీడియాలో వారిని ట్రెడింగ్ వ్యక్తులుగా మార్చేస్తుంటారు. సరిగ్గా అలానే జరిగింది రాకేష్ రంజన్ యాదవ్ విషయంలోనూ. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ఓ యువకుడిని కాల్చి చంపిన బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గురించి ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు. అతడి అభిరుచులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు క్యూ కట్టారు. మే 7నుంచి ఇప్పటి వరకు బిహార్లో ఫేస్ బుక్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి రంజన్ యాదవ్ అని.. మంగళవారం సాయంత్రం నాటికి ఫేస్ బుక్ ద్వారా అతడి గురించి 1,44,287సార్లు తెలుసుకునేందుకు క్లిక్ చేశారు.

మే 7న రాత్రి రంజన్ యాదవ్ ఓ స్కూల్ యువకుడిని తన తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లంతా అతడి సమాచారం కోసం వివిధ పేర్లతో వెతకడం మొదలు పెట్టారు. రాకేశ్ రంజన్ యాదవ్ పేరిట 53,748మంది, రాకీ యాదవ్ పేరిట 69,789 మంది, రాకీ యాదవ్ గయా పేరిట 20,750 మంది అతడి గురించి తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ద్వారా వెతికాడు. అయితే, అతడి ప్రొఫైల్ లో అతడి వివరాలేమి కనిపించలేదు. కానీ, కొన్ని ఫొటోల్లో మాత్రం కండల వీరుడిగా కనిపించాడు. ఈ తుపాకులతో పలుసార్లు పోజిచ్చి కనిపించాడు. దీని ప్రకారం అతడికి తుపాకులంటే చాలా ఇష్టమని తెలిసింది.

బీహార్లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి అతిక్రమించడంతో అమె కూడా ప్రస్తుతం అరెస్టు వారెంట్లను అందుకోనున్నారు. మధ్య నిషేదం అములలో వున్నా అమె తన నివాసంలో బాటిళ్ల కోద్ది మధ్యం సీసాలను అట్టిపెట్టుకున్నారన్న అరోపణలపై అమెను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మనోరమా దేవి యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు, ఆయనను రెండు రోజుల పోలీసుల కస్టడీకీ స్థానిక న్యాయస్థానం అదేశించడంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles