Panama Papers: Complete list of names behind offshore accounts released

Panama papers new icij data shows about 2000 indian names

panama papers, panama papers complete list, panama papers database, ,Mossack Fonseca,Indians in Panama Papers,ICIJ, panama papers list of names, panama papers icj, india news

ICIJ will not release any of the 11.5 million files found in the internal database of the Panamanian corporate service provider Mossack Fonseca.

మరికొందరి పేర్లు బట్టబయలు.. నల్లధన కుబేరుల గుండెళ్లో రైళ్లు..

Posted: 05/10/2016 11:12 AM IST
Panama papers new icij data shows about 2000 indian names

తమ దేశాలకు సక్రమంగా కట్టాల్సిన పన్నును ఎగ్గోట్టి విదేశాలలో పెట్టుబడులు పెట్టి.. నల్లధనాన్ని మూటగట్టుకుంటున్న అక్రమ కుబేరులకు సంబంధించిన మరో జాబితా బహిర్గమైంది. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకుపైగా ‘పనామా’ పత్రాలను సోమవారం రాత్రి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఏయే దేశానికి చెందిన వారు ఏయే వ్యాపారాల పేరుతో విదేశాలో అక్రమంగా డబ్బను తరలించారో ఈ డాక్యూమెంట్లలో పోందుపర్చివుంది. www.offshoreleaks.icij. org వెబ్‌సైట్‌లో ఇవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

3.6 లక్షల మంది వ్యక్తులు, కంపెనీల పేర్లు వీటిలో ఉన్నాయని ఐసీఐజే సభ్యులు తెలిపారు. పనామాకు చెందిన  ప్రైవేట్ లా సంస్థ మొసాక్ ఫోన్సెకా సంస్థ నుంచి తీసుకున్న సమాచారం ఈ పత్రాల్లో ఉంది. కాగా ఇందులో సుమారుగా రెండు వేల మంది భారతీయులు వున్నారని, వాటి చిరునామాల ఆధారంగా వీరిని లెక్కించామని కూడా ఐసిఐజే సభ్యులు తెలిపారు. దేశానికి పన్ను ఎగవేసి.. పన్నురాయితీ కల్పించే విదేశాలకు ఆ డబ్బును తరలించి వ్యాపారాభివృద్ది చేసుకున్న వారి జాబితాలో ఎందరో ప్రముఖుల పేర్లు ఇప్పటికే బయటపడటంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని అనేక మంది నల్లకుబేరుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇదిలావుండగా, పనామా పత్రాల్లో పేర్లున్న భారతీయులపై సీబీఐ విచారణ  జరపాలని వచ్చిన ఒక పిటిషన్‌పై స్పందన ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన దరఖాస్తును విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పనామా పత్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న 500 భారతీయ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ఒక మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panama papers  Mossack Fonseca  Indians in Panama Papers  ICIJ  

Other Articles