ఏపి రాజధానిలో ఉద్రిక్తత | Tension in AP capital Amaravathi

Tension in ap capital amaravathi

AP, Capital, Velagapudi, A Secretariate, ఏపి, సచివాలయం, వెలగపూడి, అమరావతి

Tension situation at AP Capital. In Velagapudi, A worker died in a concret machine. Workers fired on L and T staff. After that they burned a Vehicle.

ఏపి రాజధానిలో ఉద్రిక్తత

Posted: 05/10/2016 11:47 AM IST
Tension in ap capital amaravathi

ఏపి రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి అనుకున్న టైంలో. రాజధాని గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాజధాని గ్రామం వెలగపూడి కార్మికుల ఆగ్రహంతో కుత‌కుత‌లాడుతోంది. తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో జ‌రిగిన అప‌శృతి పెద్ద ఆందోళ‌న‌కు దారితీసింది. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో ఎల్ అండ్ టీ అధికారుల నిర్లక్ష్యం పెను దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్ తీసుకున్న ఎల్ అండ్ టీ సంస్థ క‌నీస భ‌ద్రతా చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంతో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

గ‌తంలో వెస్ట్ బెంగాల్ కి చెందిన కార్మికుడు మ‌ర‌ణించ‌గా..తాజాగా మ‌రో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయిన‌ప్పటికీ ఎల్ అండ్ టీ గానీ , పోలీసులు గానీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కార్మికులు అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. ఉత్తర‌ప్రదేశ్ కి చెందిన కార్మికులు పెద్ద స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క‌నీసం మృత‌దేహాన్ని కూడా త‌ర‌లించ‌క‌పోవ‌డం ప‌ట్ల నిర‌స‌న‌కు దిగారు. దాంతో ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. ఆంబులెన్స్ ను త‌గుల‌బెట్టారు. ఇత‌ర వాహ‌నాలు కూడాత‌గుల బెట్టిన‌ట్టు స‌మాచారం. దాంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles