Harish Rawat has won trust vote, claims BJP MLA, official results to be declared tomorrow

Floor test of harish rawat ends sc to declare result

uttarakhand, uttarakhand floor test, floor test, floor test live, Rawat has won trust vote, congress, bjp, harish rawat, congress floor test, uttarakhand assembly, uttarakhand government

Harish Rawat reportedly received the support of 3 independent legislators, along with 2 BSP and 1 Uttarakhand Kranti Dal MLA, taking his total tally to 33.

ఉత్తరాఖండ్ బలపరీక్ష: రేపు ప్రకటించనున్న సుప్రీం.. ధనబలం గెలిచిందన్న బీజేపి

Posted: 05/10/2016 12:19 PM IST
Floor test of harish rawat ends sc to declare result

దేవుడు, రాష్ట్ర ప్రజలు తమ వైపున ఉన్నారని, తాము తప్పకుండా బలపరీక్షలో గెలుపొందుతామని ధీమాను వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అనుకున్నట్లుగానే ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో విజయం సాధించినట్లు వార్తలు అందుతున్నాయి. బలపరీక్షలో నెగ్గేందుకు ఆయనకు కావాల్సిన 31 మంది సభ్యుల సంఖ్యకు ఆయన సునాయాసంగానే చేరుకున్నారని, దీంతో ఉదయం నుంచి అన్ని పార్టీలకు, రాజకీయ నేతలకు, రాష్ట్ర ప్రజల ఉత్కంఠతకు తెరపడినట్లు అయ్యింది.

కాగా బలపరీక్షకు అవసరమైన సంఖ్య కన్నా అధికంగా మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి హరీశ్ రావత్కు మద్దతుగా ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో ఆయనకు 33 నుంచి 34 మంది సభ్యుల బలం నిరూపణ కావడంతో విశ్వాస పరీక్ష ముగిసింది. అయితే బలపరీక్ష ఫలితాలను రేపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించినుంది. అత్యున్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షను ఇద్దరు అధికారుల బృందం పరిశీలించి.. బలపరీక్ష వృత్తాంతాన్ని వీడియోలో నిక్షిప్తం చేసింది.

దానిని పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఇందుకోసం ఉత్తరాఖండ్ లో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా అభియాన్స్ లో వుంచి బలపరీక్షను నిర్వహించారు. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తాము ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా ఓబు బడ్జెట్ లో ఓటువేసిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలకు విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి వీళ్లేదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో హరీశ్ రావత్ మరోమారు సిఎం పగ్గాలు చేపట్టే అవకాశం వుందన్న వార్తలు వినబడుతున్నాయి.

తమ పక్షాన దేవుడు, రాష్ట్ర ప్రజలు వున్నారని ధీమా వ్యక్తం చేసిన రావత్.. తాము విశ్వాసపరీక్షను గెలుస్తామన్న నమ్మకం వుందని, అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించేంత వరకు తాను ఈ విషయంలో ఏమి మాట్లాడనని చెప్పుకోచ్చారు. కేంద్రంలో అధికారంతో మిడిసిపడుతున్న బీజేపిని ఓడించేందుకు తమకు సహకరించిన ప్రజాస్వామ్య శక్తులను, ముఖ్యంగా ప్రజాస్వామ్య పరఢవిల్లాలని అదేశాలను జారీ చేసిన సుప్రీం కోర్టుకు రావత్ ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దుతు 27 వుండగా, అందులోంచి నిన్నటి వరకు తమతో టచ్ లో వున్న రేఖా అర్యా చివరి క్షణంలో పార్టీ ఫిరాయించి బీజేపికి మద్దతు పలుకగా, అటు బీజేపి సస్పెండెడ్ ఎమ్మెల్యేగా భీమ్ లాల్ ఆర్యా కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఈయనతో పాటుగా ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా రావత్ కు అండగా నిలిచారు. సరిగ్గా బలపరీక్షకు ముందు ఆ పార్టీ అధినేత్రి మాయవతి కాంగ్రెస్ కే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీతో పొత్తు కుదిరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. వీరితో పాటు ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ కు చెందిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ సర్కార్ కు మద్దతుగా నిలవడంతో రావత్ సునాయాసంగా బలపరీక్షను ఎదుర్కోన్నారు. కాగా, అధికారపక్షం థనబలంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి విశ్వాస పరీక్షలో గెలిచారని బీజేపి గణేష్ జోషి అరోపించారు. ధనబలం ముందు తమ బలం ఓడిపోయిందని, అందుచేత తామ బలం వీగిపోయిందని అయన అరోపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand  assembly floor test  congress  bjp  harish rawat  

Other Articles