Woman blames of rape on bus driver and conductor in jharkhand

32 year old woman raped in a bus in jharkhand

rape, gang rape, lady passenger, bus driver, jharkhand, Bihar, Koderma, Bus, rape on women, violence on woman, harrasement on women, molest on women, Jharkhand crime, jharkhan rape

A 32-year-old woman was allegedly raped in a bus in Jharkhand’s Koderma district, police said Saturday.

జార్ఖండ్ లో మరో నిర్భయ ఘటన.. మహిళపై గ్యాంగ్ రేఫ్

Posted: 05/07/2016 07:04 PM IST
32 year old woman raped in a bus in jharkhand

జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. మహిళ ఒంటరిగా కనబడితే చాలు వంకర చూపులు, వెకిలి చేష్టలతో పేట్రేగిపోతున్న మదమృగాళ్లు.. మరోమారు కూడా అలాంటి దారుణానికే పాల్పడి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. జార్ఖండ్ నుంచి బిహార్ వెళ్తున్న ఓ మహిళపై బస్సులోనే అదే బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ దారుణం కోడెర్మా జిల్లాలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ జార్ఖండ్ లోని కోడెర్మా జిల్లా నుంచి బిహార్‌లోని నవడా జిల్లాకు శ్రీ ట్రావెల్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో బయల్దేరింది.

ప్రయాణికులలో మిగిలినవాళ్లంతా కోడెర్మా జిల్లాలోని తిలైయ్యా అనే ప్రాంతంలో దిగిపోయిన తర్వాత.. డ్రైవర్ బస్సును నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో పాటు అతడి అసిస్టెంట్ కూడా ఆ మహిళపై అత్యాచారం చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు వైద్యపరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.  నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు మొదలయ్యాయని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో సగటున ప్రతి 8-9 గంటలకు ఒక మహిళ లేదా బాలికపై అత్యాచారం జరుగుతున్నట్లు నేర రికార్డుల బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అరోపణలు వినబడుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gang rape  lady passenger  bus driver  jharkhand  Bihar  Koderma  Bus  crime  

Other Articles