no increase in number of assembly constituencies in Telugu states

No constituencies reorganization in telugustates

Reorganization, election commision, assembly seats, Telugu states, Andhra pradesh, Telangana, no increse in assembly seats, state reorganisation bill

Election commissiom of india states that there will be no increse in assembly seats in Telugu states Andhra pradesh and Telangana.

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు లేదు

Posted: 05/07/2016 06:44 PM IST
No constituencies reorganization in telugustates

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు వుంటుందని చెప్పుకోచ్చిన పలువురు నేతల మాటలు నేతి బీరలో నెయ్యిమాదిరిగానే మారనున్నాయి. ఈ మేరకు వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలలో పెంపు లేదని ఈసీ స్పష్టం చేసింది. సమీప భవిష్యత్‌లో రెండు తెలుగురాష్ట్రాలలో శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదని అది తేల్చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయ సలహా కోరిందా? భారత అటార్నీ జనరల్ నుంచి ఏదైనా సలహా కోరిందా? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపును చేపట్టే ప్రతిపాదన ఏదైనా ఉందా? అంటూ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాధానం ఇచ్చింది.

తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు వీలుకల్పించే చట్టం ఏదీ లేనందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఎన్నికల సంఘం వివరించింది.  రాజ్యాంగంలోని 170 (3) అధికరణ లోని నిబంధనలే అమలులో ఉంటాయంటూ  కేంద్ర హోంశాఖ నుంచి తమకు అందిన లేఖ ప్రతిని కూడా ఈ లేఖతో పాటు అందించింది. అంటే రాజ్యాంగ సవరణ చేస్తూ మరో చట్టం చేస్తే తప్ప పునర్విభజనకు అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్ర హోంశాఖ చేపట్టింది. పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని వివరణలు కావాలని అది భావించింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణను బట్టి చూస్తే ఎస్‌సి ఎస్టీ నియోజకవర్గాల పునః పంపిణీకి అవసరమైన సర్దుబాటుకు తప్ప పునర్విభజనకు అవకాశమే లేదని 2014 సెప్టెంబర్ 8న తమకు కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసిందని ఎన్నికల సంఘం వివరించింది.  

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles