EC Flying Squad Seizes Rs 9 Lakhs from Actor-Politician

Rs 9 lakh seized from kollywood hero

EC Flying Squad, Actor-Politician, All India Samathuva Makkal Katchi, Thoothukudi, Nallur Vilakku, Sarathkumar, Elections, Money, Seized, Election Commission, Tamil Nadu

Election officials on Saturday seized Rs. 9 lakh cash from the car of actor-politician R. Sarathkumar, who is contesting the May 16, 2016 Tamil Nadu Assembly elections.

తనీఖీలలో డబ్బుతో సహా పట్టుబడ్డ హీరో..

Posted: 05/07/2016 07:06 PM IST
Rs 9 lakh seized from kollywood hero

శీర్షిక చూసి ఏమిటీ హీరో డబ్బుతో పట్టుబడ్డాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే అది ముమ్మాటికీ నిజమే, కాలీవుడ్ కు చెందిన నాటి అగ్రనటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ శనివారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న డబ్బుతో పట్టుబడ్డారు. 'ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి' అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాఏడీఎంకేతో పొత్తుతో తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

తాను పోటీచేస్తున్న నియోజకవర్గానికి సమీపంలోనే ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన కారులో 9 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించడంలో శరత్ కుమార్ విఫలమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో డిపాజిట్ చేసినట్లు వారు వెల్లడించారు. మే 16న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 80 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నేరుగా ఇలా డబ్బుతో పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి. హీరోయిన్ రాధిక భర్త అయిన శరత్ కుమార్.. ఇలా పట్టుబడ్డారు గానీ, తమిళనాడు ఎన్నికల్లో భారీ మొత్తంలో ధన ప్రవాహం సాగుతోందని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. పట్టుబడింది ఆవగింజలో ఆరోవంతేనని, ఇంకా చాలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarathkumar  Elections  Money  Seized  Election Commission  Tamil Nadu  

Other Articles