Vijay Mallya says banks cannot seek details about his foreign assets

Mallya s troubles to worsen for not disclosing assets on sc order

vijay mallya, vijay mallya supreme court, mallya supreme court, vijay mallya assets, mallya assets, vijay mallya overseas assets

Vijay Mallya also requested the apex court to intervene in pending cases so that he can sell the shares stuck in litigation.

ఈడీ అనుమానం నిజమైంది.. భుజాలు చరుచుకున్న మాల్యా

Posted: 04/21/2016 11:59 PM IST
Mallya s troubles to worsen for not disclosing assets on sc order

తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. ఆ రుణాలతో విదేశాలలో అస్తులను సమకూర్చుకున్నారన్న అనుమానాలలో నిజం వున్నట్లు కనిపిస్తుంది, అందుకే కాబోలు ఈఢీ అనుమానాల నేపథ్యంలో విజయ్ మాల్యా తన భుజాలను చరుచుకున్నారు. అంతేకాదు తన విదేశీ అస్తుల వివరాలు బ్యాంకులకు ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. తన విదేశీ ఆస్తుల గురించి సమాచారం అడిగే అధికారం బ్యాంకులకు లేదని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఇప్పట్లొ ఇండియాకు వెళ్లలేను- విజయ్ మాల్యా

తాను, తన భార్య, ముగ్గురు సంతానం కూడా ప్రవాస భారతీయులు (ఎన్నారై) అయినందున తమ విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మాల్యా తరఫు లాయరు అత్యున్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. ఈ కేసు విచారణలో భాగంగానే ఏప్రిల్ 21లోగా తన కుటుంబానికి దేశ, విదేశాల్లో ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు వెల్లడించాలని, విచారణకు ఎప్పుడు హాజరవుతారో కూడా తెలపాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది.

మాల్యాను తీసుకురండి.. ఫైన్ కడతా

ఇక మరోవైపు, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిన కేసులో మాల్యాను నిందితుడిగా ఒక స్థానిక కోర్టు నిర్ధారించింది. అయితే విచారణకు ఆయన  హాజరు కాకపోవడంతో శిక్షపై ఉత్తర్వులు ఇవ్వలేదు. మే 5న తీర్పు రావచ్చని భావిస్తున్నట్లు జీఎంఆర్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. ఆయనపై నాన్-బెయిలబుల్ వారంటు జారీ అయిన నేపథ్యంలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్) వచ్చేలా సీబీఐకి కూడా త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  supreme court  vijay mallya assets  vijay mallya overseas assets  

Other Articles