Vijay Mallya indicates he won't return for now

Vijay mallya indicates he won t return for now

Vijay Malya, Kingfisher, India, Return to India, Vijay malya case, Vijay Malya Row

As the Indian judiciary and banks efforts to recover Rs 9,000 crore dues from billionaire Vijay Mallya reach a level of desperation, the liquor baron who is estimated to be worth about Rs 7,000 crore has indicated that he may not return to India at all. "I do not feel the time is right. I feel passions are high. People need to think rationally," he said in an interview to the Sunday Guardian. In an indication he may even choose not to return at all, he has also said that he hoped that he would "return one day".

ఇప్పట్లొ ఇండియాకు వెళ్లలేను- విజయ్ మాల్యా

Posted: 03/14/2016 11:33 AM IST
Vijay mallya indicates he won t return for now

క్రిమినల్ గా ముద్రపడ్డ తాను ఇప్పట్లో ఇండియాకు రాలేనని తేల్చేశాడు కింగ్ ఫిషర్ అధినేత మాల్యా. దేశానికి రావడానికి ఇది సరైన టైమ్ కాదని చెప్పాడు. ‘ద సండే గార్డియన్‌’ ఇ-మెయిల్‌ ద్వారా అడిగిన ప్రశ్నలకు మాల్యా సమాధానమిచ్చాడు. మీరు భారత్‌కు ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారని ప్రశ్నించగా, ‘నేను భారతీయుణ్ని. నాకూ తిరిగి వెళ్లాలనే ఉంటుంది. అయితే నా వాదనను సమర్ధించుకుని, చెప్పుకునేందుకు సానుకూల పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. ఇప్పటికే క్రిమినల్‌గా నాకు ముద్ర వేశారు. అందుకే ఇది తగిన సమయం కాదన్నది నా భావన’ అని మాల్యా తెలిపారు. ‘నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి. ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు మరికొందరిని కష్టాల్లో పడేసే అవకాశం ఉంద’ని పేర్కొన్నారు. ‘నేనేమీ తప్పు చేయలేదు. నేనూ బాధితుణ్నే. ఎప్పడూ అందుబాటులో ఉండేవాడిని, దాక్కునేలా చేశారు. ఇందువల్ల నేను అనారోగ్యానికి గురయ్యా’ అని మాల్యా వివరించారు.

మరోవైపు భవిష్యత్‌ ప్రణాళికను తెలియజేయాలంటూ పీటీఐ పంపిన ఇ-మెయిల్‌కు మాల్యా నుంచి స్పందన రాలేదు. అయితే తన కోసం బ్రిటన్‌లో మీడియా అన్వేషిస్తోందని.. మాల్యా ట్వీట్‌ చేశారు. ‘బ్రిటన్‌లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. బాధపడాల్సింది ఏంటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్‌లో తెలిపారు. నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాల్యా తరుపు న్యాయవాది హెచ్‌.సుధాకర్‌ రావు చెప్పారు. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారులను న్యాయస్థానానికి రప్పించేందుకు చట్టాలను పూర్తి సాయిలో ఉపయోగిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆదేశించగా, చెల్లని చెక్కు (చెక్‌ బౌన్సు) కేసు విచారణకు మాల్యా గైర్హాజరు అవ్వడాన్ని పరిగణనలోకి తీసుకొని నాంపల్లి కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో భారత్‌కు తాను తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని విజయ్‌ మాల్యా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Malya  Kingfisher  India  Return to India  Vijay malya case  Vijay Malya Row  

Other Articles