2032కల్లా పేదలు లేని భారత్| India will be a $10 trillion economy with no poverty in 2032

India will be a 10 trillion economy with no poverty in 2032

India, Poor, economy, Growth, ఇండియా, మోదీ, కేంద్రం, నీతి ఆయోగ్, అభివృద్ది

India will become $10 trillion economy and achieve growth rate of 10% by 2032, Niti Aayog Chief Executive Officer Amitabh Kant said on Thursday. The country's growth rate is 7.6% in 2015-16 and its economy is $1.7 trillion.In a presentation made during Civil Services Day function attended by Prime Minister Narendra Modi and large number of civil servants, he projected creation of 175 millions jobs and zero per cent of Below Poverty Line (BPL) population by 2032.

2032కల్లా పేదలు లేని భారత్

Posted: 04/22/2016 07:34 AM IST
India will be a 10 trillion economy with no poverty in 2032

భారత్ దూసుకెళుతోంది.. అభివృద్ది వైపు భారత్ మిగిలిన దేశాలకు ధీటుగా పరుగులుపెడుతోందని అందరికీ తెలిసిందే. కానీ అదే వృద్దది రెండంకెలతో ముందుకు దూసుకెళ్లగలిగితే పేదరికాన్ని సమూలంగా నిర్మూలించవచ్చని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన 10వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రధానితోపాటు పలువురు సివిల్ సర్వీస్ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పుస్తకం ముఖ్యాంశాలపై అమితాబ్ కాంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. నిలకడగా పది శాతం వృద్ధి సాధించగలిగితే 2032కల్లా భారత్ పేదలు లేని దేశంగా మారనుందని, ఆర్థిక వ్యవస్థ సైజు 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందని, దేశంలో కొత్తగా 17.5 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం దేశ వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండగా.. ఆర్థిక వ్యవస్థ సైజు 1.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది.

మున్ముందు వృద్ధిరేటు 7 శాతం స్థాయిలోనే కొనసాగితే 2032కల్లా ఆర్థిక వ్యవస్థ సైజు 6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికే పరిమితం కాగలదని, 5-6 శాతం మంది పేదరికంలోనే మగ్గుతుంటారని ఆయన వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో ప్రధాన అంశాలపై దృష్టిపెట్టేందుకు వీలుగా మోదీ ప్రభుత్వం పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో కూడిన 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యదర్శుల బృందాల ప్రతిపాదనలపై ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ జరిగింది. వీరంతా మార్పుకు ఏజెంట్లుగా వ్యవహరించనున్నారని అమితాబ్ కాంత్ అన్నా రు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles