Expect More Rapes With Women Allowed Into Shani Temple, Says Shankaracharya Swaroopanand

Sai baba s worship causing maharashtra drought says shankaracharya

Shakaracharya, Swaroopanand Saraswati, Shirdi Sai Baba, Dwaraka-Sharda Peeth, Maharashtra, Drought, Shani Shingnapur temple, rapes, gang rapes, Crime against women

Shankaracharya of Dwaraka-Sharda Peeth Swami Swaroopanand Saraswati on Sunday blamed the worship of Shirdi Sai Baba as the cause for drought in parts of Maharashtra.

షిర్డీ సాయిపై స్వరూపానంద వివాదస్పద వ్యాఖ్యలు..మహిళలపై రేప్ లు పెరుగుతాయట

Posted: 04/11/2016 07:33 PM IST
Sai baba s worship causing maharashtra drought says shankaracharya

ప్రముఖ ద్వరాక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపనంద స్వామి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలే కరువుతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర వాసులను ఒక పీఠాధిపతి హోదాలోతన ఓదార్చాల్సిందిపోయి.. వారిని మరింతగా కుంగదీసే వ్యాఖ్యలు చేశారు. సర్వమతాల వారు గురువుగా అరాధించే షిర్డీ సాయిబాబాపై ఇప్పటికే పలుమార్లు విషం కక్కిన స్వరూపానంద.. మరోమారు అదే విషయమై వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు, మహారాష్ట్రవాసులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు.  

షిర్డీ సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి షిర్డీ ప్రాంతంలో సాయిబాబాను ఆరాధించారని, అందుకే కరువు, నీటికొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. షిరిడీ సాయిబాబా ఒక ఫకీర్ అని, అయిన దైవాంశసంభూతుడు కాదని అన్నారు, ఆయనను పూజించడం అపవిత్రమని పేర్కోన్నారు, అలాంటి వారిని పూజించినప్పుడు ప్రకృతి ప్రకోపాలు చవిచూస్తాయని, అందుకనే మహరాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు,

ఇక మహిళలను ఆలయ గర్భగుడిలోకి అనుమతించడం ద్వారా అరిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మరీ ముఖ్యంగా శనిసింగాపూర్ లోని శనేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడాన్ని శంకరాచార్య స్వరూపనంద స్వామి తప్పుపట్టారు. దీనివల్ల భవిష్యత్లో మహిళలు మరన్ని అత్యాచారాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. శని దేవుడు పాపాల దేవుడని, ఆయనను మహిళలు అరాధించడం వల్ల మహిళలపై అత్యాచారాలు మరింత పెరుగుతాయని స్వరూపానంద చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Baba  Maharashtra  drought  Shankaracharya Swaroopanand  women  

Other Articles