Three castaways rescued from Fanadik, in Micronesia, after spelling out 'HELP' in sand

Stranded sailors rescued from pacific island after building help sign on sand

Fanadik, Micronesia, castaways island, help, US Navy, US Coast Guard, 19-foot skiff boat, boat capsized, Pulap, life jackets, U.S. Coast Guard spokeswoman Melissa McKenzie, Pacific ocean, AMVER vessels

Three men who were stuck on the uninhabited island of Fanadik, in Micronesia, proved that when they were rescued after scrawling the letters help on the ground.

ఆ నాలుగు అక్షరాలే.. వారిని సరక్షితంగా గమ్యానికి చేర్చాయి

Posted: 04/11/2016 06:58 PM IST
Stranded sailors rescued from pacific island after building help sign on sand

ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్న మాటలు అపదలో చిక్కుకున్న వారి పాలిట అక్షర సత్యాలుగా మారాయి. వాస్తవానికి అపదలో చిక్కకున్న వారికి అందోళనలో ఎలాంటి అలోచనలు రావు, కానీ ఇక్కడ అపదలోనే వున్న ముగ్గురు ఓ నిర్జన ద్వీపానికి చేరుకుని అక్కడ తమకు సాయం అందించాలని వినూత్న రీతిలో కోరారు, అదెలా అంటరా అదే వారికి వచ్చిన ఐడియా. వారి ఐడియా మేరకు నావికాదళ సిబ్బంది, కోస్టల్ గార్డు సిబ్బంది వారిని సురక్షితంగా వారివారి గమస్యానాలకు చేర్చారు.

వివరాల్లోకి వెళ్తేజ. గత సోమవారం పసిఫిక్ మహా సముద్రంలో చిన్న పడవలో విహారానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. పెద్ద అల తాకిడికి వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి మునిగిపోయింది. వారు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈతకొట్టడం మినహా మరో మార్గం కనిపించలేదు. అదృష్టవశాత్తు వారందరూ లైప్ జాకెట్లు ధరించడంతో సునాయాసంగా సముద్రంలో రెండు మైళ్ల దూరం ఈతకొట్టి ఫనాడిక్ అనే ద్వీపం తీరానికి చేరుకున్నారు. ఒడ్డుకు అయితే చేరుకున్నారు కానీ అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. మూడు రోజులు అక్కడే ఉండిపోయారు.

ముగ్గురూ తప్పిపోయిన విషయాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది మంగళవారం గుర్తించారు. నావీ సిబ్బంది సాయంతో వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. రెండు కార్గో పడవలతో 17 గంటల పాటు గాలించినా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇంతలో ఆ ముగ్గురికి ఓ ఉపాయం వచ్చింది. సముద్ర తీరంలోని ఇసుకపై తాటి ఆకులను  HELP (హెల్ప్) పెద్ద అక్షరాల్లో కనిపించేలా పరిచారు. నావీ విమానంలో గాలిస్తున్న సిబ్బంది గురువారం ఈ దృశ్యాన్ని గుర్తించడంతో వారి కష్టాలు తీరాయి. ఫనాడిక్ ద్వీపంలో చిక్కుకుపోయిన ముగ్గురు  సురక్షితంగా పులాప్కు వెనుదిరిగి వచ్చేందుకు ఓ పడవను ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురూ సురక్షితంగా తిరిగివచ్చారు. తమను కాపాడిన నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. రెండు వారాల్లో కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపదలో ఉన్న 15 మందిని రక్షించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fanadik  Micronesia  three castaways island  help  pacific ocean  

Other Articles