'No doubt' US drones have killed civilians says US prez barrack obama

Obama acknowledges civilian deaths by us drones

president obama, islamic state, terrorism, nuclear security summit, islamic state of iraq and syria, Judeo-Christian civilization, President Barack Obama, drone strike policy, ISIS, Government and politics, Drone surveillance and warfare, Drone aircraft, General news, Military and defense, Barack Obama, United States government, United States

President Barack Obama defended his drone strike policy Friday, even as he admitted that the U.S. had at times killed innocent civilians.

ఔను అది నిజమే.. అమాయకులు కూడా అనేకులు అసువులు బాసారు..

Posted: 04/02/2016 02:08 PM IST
Obama acknowledges civilian deaths by us drones

అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా తమతో జరిగిన తప్పిదాలను ఎట్టకేలకు బయటపెట్టారు. అణు భద్రత సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకు తాము సాగించిన డ్రోన్లు విధానం ఎంతగానో ఉపకరించిందని చెబుతూనే ఈ విధానంలో ఎంతో మంది అమాయక ప్రజలు కూడా బలయ్యారని ఒబామా  అంగీకరించారు. అయితే డ్రోన్ల ద్వారా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించుకున్నారు.

డ్రోన్ల ద్వారా సాగించిన యుద్దం విధానాన్నికి తాను ఎప్పుడు అనుకూలమేనని మరోసారి స్పష్టం చేశారు. అణుభద్రత సదస్సులో డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న భద్రతపై ఇరవై దేశాల అధినేతలతో చర్చించారు. తమ దేశం చాలా తప్పులు చేసిందని.. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు ఈ సదస్సులో కీలక అంశాలుగా మారాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఐఎస్ఎస్ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని, మహిళలు, చిన్నారులు వారి టార్గెట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ లో అమెరికా కరెన్సీని వినియోగించడాన్ని నిషేధించాలని అమెరికా భావిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, అరికట్టడానికి తాము చాలా కృషి చేస్తున్నామని, ఇకముందు అమెరికా దాడులు గతంలో మాదిరిగా ఉండవంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బరాక్ ఒబామా హెచ్చరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Barack Obama  drone strike policy  nuclear security summit  ISIS  

Other Articles