police files case againt psycho for vulgur postings on social media

Phsyco vulgur posts in facebook for girl her engagement cancelled

Facebook, vulgar posting, cancel engagement, young man phsyco, produtoor, ananthapuram, andhra pragathi grameena bank, srinivas nagar, shivakrishna, anathapuram town police station

ananthapuram town police files case againt psycho, who posts vulgur postings on social media

పెళ్లి చేసుకుంటావా..? లేదా..? నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా.?

Posted: 03/16/2016 02:35 PM IST
Phsyco vulgur posts in facebook for girl her engagement cancelled

బ్యాంక్ ఉద్యోగం లభించినా.. బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది. తనతో వివాహం కోసం నిశ్చితార్థం చేసుకుందామన్నుకున్న ఆ యువతితో పాటు వారి తల్లిదండ్రులకు సదరు ఉద్యోగి తన సైకో చేష్టలతో మానసిక క్షోభకు గురిచేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న దంపతులు తమ కుమార్తెను అనంతపురంలో నివాసముంటున్న వారి దూరపు బంధువు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న శివకృష్ణకు ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు 2014 అక్టోబర్ 24న వివాహ నిశ్చితార్థం జరిగింది.

నిశ్చితార్థం రోజేనే యువతి కుటుంబ సభ్యుల పట్ల సదరు ఉద్యోగి దురుసుగా ప్రవర్తించాడు. పెళ్లికి ముందే ఇలా వుంటే ఇక పెళ్లైతే.. ఎలావుంటుందో అనుకుని యువతి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నారు. దీంతో అతను నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయినట్లేనని చెబుతూ ప్రతి రోజూ ఆ యువతి ఇంటికి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఇచ్చి వివాహం చేయకుంటే మీ కుమార్తెకు ఎక్కడా పెళ్లి కాకుండా చేస్తానని బెదిరించాడు. అవసరమైతే ఆమెను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటానని హెచ్చరించసాగాడు. ఇలా ఏడాదిన్నర నుంచి అతను అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు.

ఇటీవల ఆ యువతి తల్లిదండ్రులు తమ బంధువుల ద్వారా పిడుగులాంటి వార్త ను వినాల్సి వచ్చింది. ఫేస్ బుక్‌లో నిశ్చితార్థం ఫొటోలతో పాటు  శివకృష్ణ- ఆ యువతి ప్రేమించుకున్నట్లు మెసేజ్‌లు ఉన్నాయి. ఇలా నిత్యం అసభ్యకర మెసేజ్‌లన్నీ పోస్టు చేస్తూ యువతి బంధువు ల అకౌంట్‌లకు ట్యాగ్ చేసేవాడు. అసభ్యకరమైన ఫొటోలకు ఆమె ముఖాన్ని జోడించి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు శివకృష్ణకు ఫోన్ చేసి నిలదీయగా తనకు తెలియదని బుకాయించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా శివకృష్ణకు ఎస్‌ఐ ఫోన్ చేసి మందలించారు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈనెల 1న  కేసు నమోదైంది. పోలీసు లు అతని కోసం గాలిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles