2 women fall of bikes at same spot in separate mishaps

Two shocking accidents in karimnagar at a time in at a place

road accident, 2 injured, two major accidents, mishap, CCTV, lorry, examination, Karimnagar city, two mishaps at same spot, women victims, 2 women fall of bikes, miraculous escape,

In a matter of seconds, two major accidents took place at the same spot in Karimnagar city. Both the victims were women and fortunately, both are out of danger.

ఒకే చోట, ఒకే సమయంలో రెండు ప్రమాదాలు.. రెండింటీలోనూ మహిళలే బాధితులు..

Posted: 03/16/2016 03:01 PM IST
Two shocking accidents in karimnagar at a time in at a place

ఒకే చోట, ఒకే సమయంలో రెండు ప్రమాదాలు.. రెండింటీలోనూ మహిళలే బాధితులు. వినడానికే విచిత్రంగా వున్నా క్షణాల తేడాతో సంభవించిన ఈ రెండు ప్రమాదాలు కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకున్నాయి. అయితే అదృష్టమేమిటంటే.. ఈ రెండు ప్రమాదాల బారిన పడిన మహిళలు స్వల్ప గాయలతోనే బయటపడ్డారు. ఇందులో ముందుగా సంభవించిన ప్రమాదం.. వేగం కారణంగా చోటుచేసుకోగా రెండో ప్రమాదంలో వాహన చోదకంలో నియంత్రణ లేకపోవడం మూలంగా జరిగింది.
 
వివరాల్లోకి వెళ్తే..  కోర్టు వైపు నుంచి శివథియేటర్‌ వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన బైకిస్టు ఓవర్‌టేక్‌ చేయాలని వేగం పెంచి దాటే ప్రయత్నం చేశాడు. ఒక్క సారి కుదుపు రావడంతో బైక్‌ వెనుక కూర్చున్న అమ్మాయి అదుపుతప్పి కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన టిప్పర్‌ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేసినా...టిప్పర్‌ దాదాపు అమ్మాయి మీదకు వెళ్లి ఆగింది. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలు నిలిచాయి. కానీ తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.  ప్రమాదం గురైన అమ్మాయి తెలిపిన వివరాల ప్రకారం పరీక్షల హాల్ టిక్కెట్ మరచిపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకుని, ఎగ్జామ్ టైం అవుతుందని వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
 
అదే ప్రాంతంలో క్షణాల తేడాతో మరో ఘటన జరిగింది.. ఒక వైపు టిప్పర్‌ ఘటన జరిగినప్పుడే కుడివైపున మరో ప్రమాదం జరిగింది.  శివ థియేటర్‌ వైపు నుంచి కోర్టు వైపు వెళ్తున్న ఒక బైక్‌...రోడ్డు పక్కన ఉన్న రాయిపై ఎక్కడంతో కంట్రోల్‌ తప్పింది.  దీంతో వెనుక కూర్చున్న మానస అనే మహిళ ఒక్కసారిగా వెల్లకిలా పడిపోయింది. అదృష్టం కొద్దీ వెనుక వాహనాలు ఏవీ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. క్షణాల తేడాతో జరిగిన ఈ రెండు ప్రమాద దృశ్యాలు సమీపంలో వున్న ఓ కంప్యూటర్‌ షాపులో అమర్చిన సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : road accident  2 injured  two major accidents  mishap  CCTV  lorry  examination  Karimnagar  

Other Articles