woman emotional blackmails banjarahills police with sleeping pills

Woman hulchul in banjara hills police station

banjara hills police station, woman, hulchul, dilsukhnagar, vijaydeep, yes bank manager, shadi.com, sleeping pills, december 5h marriage, cheating case, vijaydeep on bail, woman blackmails police, woman threats police,

dilsukhnagar woman wants to marry his ex fiance, emotional blackmails banjarahills police with sleeping pills

ప్రియుడు కావాలంటూ.. పోలీసులకు కునుకు కరువు చేసిన యువతి..

Posted: 03/11/2016 10:28 AM IST
Woman hulchul in banjara hills police station

మహిళల ఆటవస్తువుగా భావించరాదన్న పెద్దల మాట ఇప్పుడా యువకుడికి తెలిసివచ్చింది. పాశ్చాత్య సంస్కృతికి రోజురోజుకీ దెగ్గరవుతున్న దేశీయ యువత.. ఆ సంస్కృతిని అలవర్చుకోరాదని పెద్దలు నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా.. పెడచెవిన పెట్టి డేటింగ్, చాటింగ్ అంటూ చేసే చర్యలు వారిని ఇబంధుల పాలుచేస్తున్నాయి. వారినే కాదు అటు మధ్యవర్తులుగా వున్నవారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అదెలా అంటారా.. తాను కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించాలని ఏకంగా బంజారహిల్స్ పోలిస్ స్టేషన్ ముందు బైఠాయించిన యువతి.. నిద్రమాత్రలు మింగి రక్షక భటులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే... దిల్‌షుక్‌నగర్‌లో నివసించే ఒక యువతి గతేడాది షాదీ డాట్‌కామ్‌లో వరుడి కోసం వెతుకుతుండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎస్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎన్.విజయ్‌దీప్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువతిని విజయ్‌దీప్ తన వెంట తిప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 5న ఇద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. యువతి తల్లిదండ్రులు రూ. 10 లక్షల నగదు, రూ. 25 లక్షల విలువ చేసే ప్లాట్ ఇవ్వడానికి అంగీకరించారు. పెళ్లి పనులు జరుగుతుండగా విజయ్‌దీప్ ఆమె తనకు నచ్చలేని పెళ్లికి నిరాకరించాడు.

బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాద చేయగా విజయ్‌దీప్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విజయ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆయనతోనే తనకు పెళ్లి జరిపించాలంటూ సదరు యువతి పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అది తమ పని కాదని పోలీసులు పేర్కొంటుండగా రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం రాత్రి 12 గంటలకు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, నిందితుడిపై కేసు కూడా నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banjara hills police station  woman  hulchul  dilsukhnagar  vijaydeep  

Other Articles