vijayawada women harrassed in aman vedika to make prostitution

Woman tourched to death to make prostitution

Namalagundu, aman vedika, hyderabad police commissioner, chilakalguda police station, vijayawada woman, post graduate, Ghmc offficials, shelter home for women, attempt murder, acid bottle, secunderabad zonal commission, gandhi hospital,

A vijayawada women was torched by to death, and was victim of attempt murder by other women in aman vedika to make prostitution

వ్యభిచారం చేయాలని మహిళపై తోటి మహిళల దాడి, హత్యాయత్నం..

Posted: 03/11/2016 09:42 AM IST
Woman tourched to death to make prostitution

మహిళలకు మహిళలే శత్రువున్న నానుడి మళ్లీ రుజువైంది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన మహిళను గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు తోటి మహిళలు. తమతో పాటు వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ అమెను గదిలో బంధించారు. ఆ తరువాత అమెపై దాడికి దిగారు. మహిళలై వుండి తోటి మహిళను కాపాడాల్సింది పోయి.. బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపాలని ప్రయత్నించడం, ఒత్తిడి తీసుకురావడం, గదిలో నిర్భంధించడం, దాడికి పాల్పడటం.. ఘటనతో విస్తుపోయిన బాధిత మహిళ.. అక్కడి నుంచి తప్పించుకుని నగర పోలీస్ సీపీని ఆశ్రయించింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహిళ (43) పోస్ట్‌గ్రాడ్యుయేట్. కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చింది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌ను కలిసి నగరంలో తనకు ఆశ్రయం కల్పించాలని కోరింది. దీంతో ఆయన జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నామాలగుండులో నిర్వహిస్తున్న మహిళల షెల్టర్‌హోం అమన్‌వేదికలో ఉండాలని సూచించారు. ఈ మేరకు గతనెల 28 నుంచి సరోజ అక్కడే ఆశ్రయం పొందుతోంది. షెల్టర్‌హోంలో ఉంటున్న మరికొంత మంది మహిళలు తమతోపాటు వ్యభిచారం నిర్వహించాలని ఒత్తిడి తేగా ఆమె నిరాకరించింది.

ఈ క్రమంలో ఈనెల 7వతేదీన కొందరు మహిళలు తనను హోంలోని ఓ గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకుని అదేరోజు రాత్రి చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని బుధవారం నగర సీపీ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించింది. ప్రస్థుతం తాను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని శివానంద ఆశ్రమం సంరక్షణలో ఉన్నానని, తనపై దాడికి పాల్పడిన వారితోపాటు, షెల్టర్‌హోం నిర్వాహకులపైన కేసులు నమోదు చేయాలని కోరుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles