Kanhaiya faced University action for ‘misbehaving’ with woman last year

Kanhaiya faced university action for misbehaving

Kanhaiya, kanhaiya Kumar, kanhaiya JNU,Kanhaiya faced University action, kanhaiya misbehaviour, girl misbehaviour, kanhaiya girl misbehaviour, JNU news, JNU actioin, Jawaharlal Nehru University, public urinating, misbehaviour, women, kanhaiya news

The incident had occurred on June 10, 2015, when the girl student asked Kanhaiya, who at the time was not the students' union president, to not urinate in the open inside the campus.

వెలుగుచూసిన కన్హయ్య మరో ఘటన.. యువతులతో అసభ్య ప్రవర్తన

Posted: 03/11/2016 11:10 AM IST
Kanhaiya faced university action for misbehaving

జవహార్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఒక్క ఘటనతో ఏకంగా దేశాన్ని తనవైపుకు తిప్పుకుని అటు మీడియాను, యువతను, రాజకీయాలను అకర్షిస్తున్న వ్యక్తిగా మారాడు. అయితే కన్హయ్యకు వివాదాలకు దెగ్గరి సంబంధమే వుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఉగ్రవాది అప్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ వర్సిటీలో ఇటీవల జరిగిన ర్యాలీలో జాతీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న అరోపణలపై కన్హయ్య సహా మరో ఐదుగురు విద్యార్థులపై దేశద్రోహం కింద కేసు నమోదు కావడానికి ముందే.. కన్హయ్యపై యూనివర్సిటీ చర్యలు తీసుకుందట. అయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఈ జరిమాన కూడా కట్టారట. అందునా అదే విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ విద్యార్థిని పట్ల కన్హయ్య వ్యవహరించిన తీరుపై తాజాగా ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.


వర్సిటీలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న కన్నయ్యను ఓ విద్యార్థిని ప్రశ్నించింది. బహిరంగ మూత్ర విసర్జన సరికాదంటూ అతడికి షాకిచ్చిందట. సదరు విద్యార్థిని చెప్పిన మంచి సలహాను పాటించాల్సిన కన్నయ్య... అందుకు విరుద్ధంగా ఆమెపై విరుచుకుపడ్డాడట. ఆ విద్యార్థినిపై తిట్ల దండకం అందుకున్న కన్నయ్య.... ‘‘సైకో మెంటల్.. నీ అంతు చూస్తా’’ అంటూ బెదిరించాడట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు విద్యార్థిని కన్నయ్యపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారణ జరిపిన వర్సిటీ అధికారులు కన్నయ్య తప్పు చేశాడని నిర్ధారించారు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని విచారణ కమిటీ సిఫారసు చేసింది. అయితే విషయం పెద్దది కావడంతో పాటు కన్నయ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీసీ వారించారు. అయితే తప్పు చేసినందుకు గాను అతడికి రూ.3 వేల జరిమానా విధించారు. సదరు జరిమానాను చెల్లించేసిన కన్నయ్య ఆ కేసు నుంచి బయటపడ్డాడట. ఈ విషయం తాజాగా పూర్వ విద్యార్థిని యూనివర్సిటీకి రాసీన లేఖలో బయటపడింది. దీంతో ఏబివీపి విద్యార్థులు వీటి ఫోటో కాఫీలను పంచిపెడుతున్నారు.

కాగా కన్హయ్య కుమార్ విద్యార్థి సంఘానికి చెందిన అల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మాత్రం ఈ ఘటనను తోసిపుచ్చుతుంది. అధికారం తమ చేతిలో వుందని ఎందోరెందరి చేతో ఈ నాటకాలు అడించి తమ విద్యార్థి సంఘం నేతపై కవాలని బురద జల్లించే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కన్హయ్య ఏ మహిళతో దురుసుగా ప్రవర్తించే వ్యక్తి కాదని వారు వాదిస్తున్నారు. అయినా ఈ ఘటనకు జరుగుతన్న వివాదానికి ఏమాత్రం సంబంధం లేదని, కావాలనే తమ నేత ఇమేజ్ ను డామేజ్ చేయడానికే ఇలాంటి ఘటనలను ఏబీవీపి విద్యార్థి సంఘం నేతలు సృష్టిస్తుంటారని మండిపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanhaiya Kumar  JNU actioin  Jawaharlal Nehru University  public urinating  misbehaviour  women  

Other Articles