FIR against Mumbai man for threatening on Twitter to gang rape journo

Female scribe threatened with gangrape on twitter

Arrest, Twitter, journalist, Jawaharlal Nehru University, Amendra Kumar Singh, Delhi Police news, Delhi Police videos Delhi Police photos Delhi Police latest updates

Mumbai police registered an FIR late Wednesday against a person who allegedly threatened a female journalist on Twitter with gang-rape for condemning an attack on journalists at a hearing of Jawaharlal Nehru University student leader Kanhaiya Kumar

మహిళా జర్నలిస్టుకు ట్విట్టర్ లో గ్యాంగ్ రేప్ హెచ్చరిక..

Posted: 02/18/2016 06:31 PM IST
Female scribe threatened with gangrape on twitter

మహిళా జర్నలిస్టుకు ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ అయ్యాయి. అదీ సాదాసీదా హెచ్చరిక కాదు.. ఒకట్రెండు రోజుల్లో నిన్ను దారుణంగా గ్యాంగ్‌రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును హెచ్చరించాడో దుండగుడు. తన మనోభావాలపై తీవ్రంగా స్పందించిన ముంబాయి వాసి అమ్రేరందర్ కుమార్ సింగ్ మహిళా జర్నలిస్టుకు ఈ బెదిరింపులను పంపాడు. అంతేకాదు భారత మాతతో ద్రోహానికి తలపడవద్దని కూడా హెచ్చరిస్తూ అమెను దేశద్రోహిగా కూడా పరిగణించాడు. ఈ ట్విట్టర్ కామెంట్ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు.

జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీ పటియాల కోర్టులో పాత్రికేయులపై జరిగిన దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెను ఉద్దేశించి అమరేంద్రకుమార్ తీవ్రస్థాయి బెదిరింపులకు దిగాడు. 'ఒకట్రెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్‌ రేప్ జరుగుతుందంటూ ట్వీట్ చేశాడు. అమరేంద్రసింగ్ పై ఐపీసీ సెక్షన్లు 354 (ఏ) 1 (అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడటం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles