Sai temple, 2017 Asian Games, Narendra Modi, Medals, Swimming news forced to wash cars for living

Gold medallist differently abled swimmer now washing cars to earn a living

New Delhi, Bharat kumar, differently-abled swimmer, jhajjar, Paralympic India swimmer, Asian Games, Commonwealth games, Sai temple, 2017 Asian Games, Narendra Modi, Medals, Swimming news

Paralympic India swimmer Bharat Kumar who had won gold medals on international levels is forced to wash cars to sustain his livelihood.

ITEMVIDEOS: అంగవైకల్యాన్ని జయించి ఒలంపిక్ స్విమ్మర్ అయ్యాడు.. కానీ..

Posted: 02/18/2016 06:25 PM IST
Gold medallist differently abled swimmer now washing cars to earn a living

సినీమా తరహాలోనే అతనికి కష్టాలన్నీ చుట్టుమట్టాయి. అయితే కనీసం రెండు కాళ్లు, రెండు చేతులు వున్నాయా అంటే అదీ లేదు. అయినంత మాత్రాన తనకున్న ఆత్మవిశ్వాసం అతన్ని సమాజంలో గౌరవస్థానంలో నిలబెట్టింది. మొక్కవోని ఆత్మధైర్యంతో ఆయన కూడా తనకున్న అంగవైకల్యాన్ని జయించాడు. పతకాలపై పతకాలను సాధించి దేశం పేరును నలుదిశలా తన వంతుగా చాటాడు. అయినా.. అతను ఒక్క అంశాన్ని మాత్రం జయించలేదు. ప్రస్తుతం అదే సమస్య దేశంలోని అనేక మందిని పట్టిపీడిస్తుంది. అదేంటంటారా..? అదే పేదరికం.



అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి దేశానికే వన్నె తెచ్చిన పారా స్విమ్మర్‌ భరత్ కుమార్ గురించి మీకు తెలుసా... అయన గురించే మేం చెబుతున్నది. పతకాలు సాధించిన ఆయనను కడు పేదరికం వెంటాడి వేటాడింది. అతడి ప్రతిభకు గ్రహణంలా పట్టింది. అంతర్జాతీయస్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన పారా ఒలింపిక్‌ స్విమ్మర్‌ భరత 2005 జూనియర్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌, 2009 వరల్డ్‌ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించాడు. 2010 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నాడు.

కానీ భరత కుమార్‌ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రోజు గడవడానికి కార్లను తుడిచి రూపాయి.. రూపాయి సంపాదించాల్సి వస్తోంది. భరతకు పుట్టుకతోనే ఎడమ చేయిలేదు. తల్లిదండ్రులు కూలీలు కావడంతో ఆరుగురు సంతానంలో వైకల్యంతో పుట్టిన భరత మరింత భారమయ్యాడు. కడు పేదరికం కావడంతో అతడి తల్లిదండ్రులు చిన్నతనంలో పశువులు కాసేందుకు ఘజియాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపారు. కొంత కాలం అక్కడ ఆ పనిచేస్తూ ఈతవైపు ఆకర్షితుడయ్యాడు. ఓ చేయి లేకపోయినా అద్భుతంగా ఈదడం ప్రాక్టీస్‌ చేసి 50 పతకాలు నెగ్గాడు.
 
నెహ్రూ స్టేడియంలో భరత్ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు తిండి కోసం బిచ్చమెత్తాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది. తగిన ఆహారం కొనుగోలు చేసేంత సొమ్ము లేకపోవడంతో.. గుడి ముందు బిచ్చగాడిలా అడుక్కునే వాడినని భరత ఎంతో బాధగా చెప్పాడు. ఎంతో మంది సెలబ్రిటీలను సాయం చేయాల్సిందిగా వేడుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు. చివరి ఆశగా ప్రధాని మోదీకి లేఖ రాశానని ఈ పారా స్విమ్మర్‌ చెప్పాడు. సా యం చేసే వాళ్లనే తనకు మరో చేయిగా భావిస్తానని అంటున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Delhi  Bharat kumar  differently-abled swimmer  Commonwealth games  

Other Articles